Movies

అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు?

తెలుగు తమిళ,కన్నడ, హిందీ కలిపి దాదాపు 95చిత్రాల్లో నటించి అందరికన్నా అధికంగా పారితోషికం అందుకున్న అలనాటి అందాల నటి వాణిశ్రీ కి ప్రస్తుత తరం హీరోల్లో మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం. హీరోల కంటే అధికంగా రెమ్యునరేషన్ అందుకున్న ఘనత ఆమెది. సావిత్రి తర్వాత అంతటి స్థాయిలో యాక్టింగ్ లో మెప్పించిన నటి వాణిశ్రీ. తన అభిమాన నటి పక్కన చెలికత్తె వేషం వేసి,ఆతర్వాత ఆమెనే తాను అనుకరించానని ధైర్యంగా ప్రకటించిన డేషింగ్ హీరోయిన్ వాణిశ్రీ. ఇంతకీ ఈమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏమిటని వెనక్కి వెళ్తే,ఈమె అసలు పేరు రత్నకుమారి. నెల్లూరు జిల్లాలో పుట్టిన వాణిశ్రీ మొదట్లో స్థితిమంతురాలే అయినా,ఒక్కనెలలోనే ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించడం తో ఆర్ధికంగా దెబ్బతిన్నారు. టిబి వ్యాధి సోకి తండ్రి చనిపోతూ, వాణిశ్రీ ని,ఆమె అక్క కాంతాన్ని బాగా చదివించాలని మాట తీసుకున్నాడు.

భర్తకిచ్చిన మాట ప్రకారం వాణిశ్రీ తల్లి మేకలు మేపుతూ,వాటి పాలను అమ్ముతూ జీవనం సాగిస్తూ, కొద్దిపాటి ఆదాయంతోనే కూతుళ్లను చదివించే ప్రయత్నం చేసారు. ఇందులో భాగంగా మద్రాసు ఆంద్ర మహిళా సభకు వాణిశ్రీని, కాంతాన్ని పంపారు. అయితే అక్క కాంతానికి చదువు బానే అబ్బినప్పటికీ,వాణిశ్రీకి మాత్రం డాన్స్ పై మక్కువ ఏర్పడింది, భరత నాట్యం క్లాసులపై దృష్టి మళ్లింది.

అలా 12ఏళ్ళ వయస్సులోనే స్కూల్ లో డాన్స్ చేస్తూ,ఓ కన్నడ డైరెక్టర్ కంట పడింది. నటి సావిత్రిలా వుందే అనుకోవడంతో వాణిశ్రీకి తొలిసినిమా ఛాన్స్ దక్కింది. సత్య హరిచంద్ర అనే కన్నడ సినిమా ద్వారా తెరమీదికి వచ్చింది. అదృష్టమో ఏమో గానీ ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో చదువుకు టాటా చెప్పేసింది. చదువుకు గుడ్ బై చెప్పడాన్ని, సినిమాల్లో చేరడాన్ని తల్లి మొదట్లో అభ్యంతరం పెట్టినా,వరుస అవకాశాలు రావడంతో కెరీర్ కి బ్రేక్ వేయలేకపోయింది.

తమిళం, కన్నడం లలో హీరోయిన్ అవకాశాలు పుష్కలంగా వస్తున్నా, తెలుగులో మాత్రం చిన్న చిన్న సైడ్ రోల్స్ మాత్రమే వచ్చేవి. భీష్మ సినిమాలో తొలి క్యారక్టర్ చేసిన ఈమెకు వాణిశ్రీ అనే పేరును ఎస్వీ రంగారావే పెట్టారట. ఎందుకంటే ఎస్వీఆర్ సొంత బ్యానర్ శ్రీ వాణి ఫిలిం కావడంతో కొంచెం అటుఇటుగా మార్చి, వాణిశ్రీ ఖాయం చేసారని అంటారు. లక్ష్మీ నివాసం,అసాధ్యుడు , సుఖ దుఃఖాలు,తర్వాత ఆమెలోని హీరోయిన్ ని తెలుగు దర్శక నిర్మాతలు గుర్తించగలిగారు.

ఫలితంగా ఆమె టైటిల్ రోల్ లో పెట్టి సినిమాలు తీయడం మొదలైంది.చిట్టి చెల్లెలు,కథానాయిక మొల్ల ఆమె నటనకు అద్దంపట్టాయి. సూపర్ స్టార్ కృష్ణ సరసన మరపురాని కథ తో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టిన వాణిశ్రీ ఆతర్వాత 1971లో వచ్చిన దసరాబుల్లోడు,ప్రేమ్ నగర్ చిత్రాలు ఆమె కెరీర్ ని అనూహ్యంగా మలుపు తిప్పాయి. దీంతో వాణిశ్రీ, స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. సావిత్రి తర్వాత ఎన్టీఆర్ ఏ ఎన్ ఆర్ లతో నటించాలంటే వాణిశ్రీయే అనేదాకా వెళ్ళింది.

అప్పటికే జమున, సావిత్రి,భానుమతి హీరోయిన్లుగా రాణిస్తుంటే,మరోవైపు రాజశ్రీ, చంద్రకళ,హారతి వంటి కొత్త తారలు దూసుకొస్తున్నా సరే, వాణీశ్రీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. మొదట్లో సావిత్రిని అనుకరించినా, ఆతర్వాత సొంత ఇమేజ్ ఏర్పరచుకున్నారు. చామన ఛాయ లో వున్నా ఫోటో జనిక్ ఫేస్ ఆమె సొంతం. ఇక కలర్స్ ఫిలిమ్స్ మొదలవ్వడంతో వాణిశ్రీ స్టైల్ ఆనాటి మహిళకు ఓ క్రేజ్ గా ఉండేది.

ఆమె చీరకట్టు,హెయిర్ స్టైల్,లిప్ స్టిక్,అన్నింటిలో వాణిశ్రీనే ఆడవాళ్లు అనుకరించేవారు. ఇక ఆనాటి యువతరానికి ఆమె గిలిగింతలు పెట్టిన పూ బోణి అనేవారు. ఎక్కువ పారితోషికం అందుకున్న నటిగానే కాకుండా, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తల్లి, అత్తా పాత్రలతో వాణిశ్రీ తానేమిటో నిరూపించుకున్నారు. ఆమెకు అనుపమ, అభినయ వెంకటేష్ కార్తీక్ అనే ఇద్దరు సంతానం. ఇద్దరూ డాక్టర్లే కావడం విశేషం.

కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య తలెత్తి విపరీతంగా లావెక్కిన వాణిశ్రీ కి ఆ సమస్య ఇంకా పెరిగి బాధ పెడుతోంది. కాగా వాణిశ్రీ పెళ్లి చేసుకుంటోందని తెల్సి అప్పట్లో ఓ అగ్ర హీరో ‘ఇన్నాళ్లూ నా మనసులో నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉండేది కానీ చెప్పలేకపోయా’అని ఏడ్చాడట. అంతేకాదు తనకు పెళ్ళై పిల్లలున్నా సరే, నీవు సరేనంటే, తిరిగి పిల్లలు పుట్టేలా ఆపరేషన్ కూడా చేయించుకుంటానని కూడా వాణిశ్రీ కి ఆఫర్ కూడా ఇచ్చాడట. ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనానికి దగ్గరగా ఉంటున్న వాణిశ్రీ తెలుగు చిత్ర సీమలో ఓ లెజెండ్.