Movies

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఎవరి ఇంటిలో ఉంటుందో తెలుసా?

ఘట్టమనేని శివరామ కృష్ణ అంటే తెలియక పోవచ్చేమో గానీ సూపర్ కృష్ణ అంటే ఆంద్ర దేశంలో తెలియని వారుండరు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా వెలిగొంది, తెలుగు చిత్ర సీమలో సినిమా స్కోప్,కలర్, 70ఎం ఎం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి హీరోగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో నటశేఖరునిగా ఈ బుర్రిపాలెం బుల్లోడు నిలిచాడు. 1943 మే31న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి,నాగ రత్నమ్మ దంపతులకు కృష్ణ పుట్టాడు. తల్లిదండ్రులు ఆర్ధికంగా స్థితిమంతులు కావడంతో డిగ్రీ వరకూ కృష్ణను వారు చదివించారు.

ఇలా డిగ్రీ పూర్తయ్యాక 1965నవంబర్ 1న ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నాడు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు ,పద్మావతి,మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని జన్మించారు. కృష్ణ దంపతులకు తొలి సంతానంగా 1965లో జన్మించిన రమేష్ బాబు,ఆ తర్వాత కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి పుట్టింది. 1970లో మంజుల జన్మిస్తే,1975లో మహేష్ బాబు పుట్టాడు.

ఇక 1969లో సినిమాలో తారసపడిన విజయనిర్మలతో కృష్ణ సహజీవనం ఏర్పరచుకు న్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే భార్య ఇందిరాదేవితోనే కృష్ణ చాలాకాలం ఉన్నాడు. ఆతర్వాత నుంచి విజయనిర్మలతో ఉంటూ ఇందిరా దేవికి దూరం జరిగాడు. అంతేకాదు విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంకా కల్సి ఉంటున్నా, పిల్లల్ని మాత్రం కనలేదు.

కృష్ణ దూరం కావడంతో పెద్దకొడుకు రమేష్ బాబుతో ఉండేది తల్లి ఇందిరాదేవి. ఎందుకంటే మిగిలిన నలుగురు పిల్లలు చిన్నవాళ్లు కావడం,రమేష్ బాబు హీరోగా ఉండడం తో రమేష్ చెంతనే ఆమె ఉంటూ, అతని పిల్లల బాగోగులు ఆమె చూసుకుంటూ ఉంటోంది. ఇక పెద్ద కూతురు పద్మావతికి ఎంపీ గల్లా జయదేవ్ తోనూ అలాగే మంజుల , ప్రియదర్శినిలకు కూడా మంచి సంబంధాలు చూసి కృష్ణ పెళ్లి చేసారు.

పిల్లలంతా సెటిల్ అవ్వడంతో ఇందిరా దేవి రమేష్ వద్దే ఉంటోంది. ఇక వీకెండ్ లో మహేష్ బాబు వచ్చి , తల్లిని చూసి యోగ క్షేమాలు తెల్సుకుని మరీ వెళ్తుంటాడు. ఇంటికి ఎక్కువగా సెలబ్రిటీలను తెచ్చుకోవడం వలన తల్లిని అన్నయ్య దగ్గరే ఉంచి సంరక్షణ చేస్తున్నాడు.