Movies

కమల్ రెండో భార్య సారిక పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే అయ్యో అంటారు

కమల్ హాసన్ అనగానే విభిన్న పాత్రలు పోషిస్తూ ఎప్పటికప్పడు అభిమానులను అలరించే విలక్షణ నటుడని చెప్పవచ్చు. 60ఏళ్ళు పైబడినా సరే, అభిమానుల కోసం రిస్క్ తీసుకుని వినూత్న చిత్రాలలో నటిస్తూ అలరిస్తున్నాడు. దక్షిణాది సూపర్ స్టార్ గా పేరొందిన కమల్ ఇప్పుడు రాజకీయ ప్రవేశం కూడా చేసాడు. అయితే ఎంత సూపర్ స్టార్ అయినా వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఆటుపోట్ల తో నిండిపోయింది. వాణీ గణపతితో మొదటి వివాహం,సారికతో రెండో పెళ్లి,గౌతమితో సహజీవనం ఇలా ఏ ఘటన కూడా కమల్ కి కలిసిరాలేదని అంటారు. ఆవిధంగా సారికతో పెళ్లి కమల్ కి సుఖ సంతోషాలను పంచింది. శృతి హాసన్,అక్షర హాసన్ వంటి ఆణిముత్యాలను సారిక అందించింది .

కమల్ రెండో భార్యగానే కాదు నేషనల్ లెవెల్లో నటిగా అందరికీ తెల్సిందే. అయితే ఆమె జీవితం తొలినుంచీ కష్టాలే. సారిక తండ్రి ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాజ్ ఫుట్. ఆమె తల్లి కమలా ఠాకూర్ మరాఠీ. వీళ్ళదిరిదీ ప్రేమ వివాహమే. అయితే సారిక పుట్టిన కొన్నాళ్లకే ఠాకూర్ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఫలితంగా స్కూల్ కి కూడా సారిక వెళ్లలేకపోయింది.

భర్త వదిలి వెళ్లపోవడంతో కుమార్తె సారికను తీసుకుని కమల ఢిల్లీ వచ్చేసింది. అక్కడున్న పరిచయాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు సారికను పరిచయం చేసింది.నిజానికి అందరితో కల్సి ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్లాల్సిన సారిక ఐదేళ్ల వయస్సులో బాలనటిగా సినీ రంగంలోకి కాలుమోపింది. అయితే తెరంగేట్రం చేసాక బాలనటి నుంచి హీరోయిన్ గా ఎదిగి ఎన్నో సినిమాలు చేసి, ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

తనకు ఓ గుర్తింపు సొంతం చేసుకుంది ఇక సచిన్ అనే మరాఠీ నటుడితో డేటింగ్ చేసిన సారిక,అదికాస్తా బెడిసికొట్టడంతో ఆతర్వాత దీపక్ ప్రసార్ అనే మోడల్ తో ప్రేమలో పడింది. అదికూడా ఫెయిల్ అవ్వడంతో చాన్నాళ్ల పాటు ఇలాంటి బంధాలకు దూరంగా ఉండిపోయింది. అయితే కరిష్మా చిత్రం షూటింగ్ లో కమల్ హాసన్ తో ఏర్పడ్డ పరిచయం ఆమెను మళ్ళీ ప్రేమవైపు నడిపించింది. కమల్ తో సహజీవనం మొదలు పెట్టిన సారిక 1986లో శృతి హాసన్ పుట్టాక , ఆతర్వాత మరో రెండేళ్లకు కమల్ తో పెళ్లయింది.

1991లో అక్షర హాసన్ కి జన్మ నిచ్చాక , వీరి సంసారంలో కలతలు స్టార్ట్ అయ్యాయి. అప్పటికే కమల్ కోసం సినిమాలకు గుడ్ బై చెప్పేసిన సారిక చెన్నైలో సెటిల్ అయిపొయింది. కమల్ తో వైవాహిక బంధం తెగిపోవడంతో కూతుళ్లను తీసుకుని ముంబయి వెళ్లి,మళ్ళీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఇక సారిక తల్లి కమల ఇటీవల మరణించింది కూడా. అయితే కోట్ల విలువైన ఆస్తిని ఫామిలీ డాక్టర్ పేరిట వీలునామా రాయడం ద్వారా , సారికను చిక్కుల్లో పడేసి పోయింది తల్లి కమల. దీంతో న్యాయంగా తనకు రావాల్సిన ఇంటికోసం కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది.