Politics

జగన్ ఎంతవరకు చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ దేశంలో రాజకీయ రంగానికున్నంత బలం ప్రస్తుతం మరే రంగానికి లేదు. అంతగా పరిస్థితులు మారిపోబట్టే, అందరూ రాజకీయాలవైపు చూస్తుంటారు. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయునిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం తండ్రి బాటలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా పొందాలని ఎదురు చూస్తున్నారు. అసలు కాంగ్రెస్ లోనే ఎంపీగా ఎన్నికైనా, ఆతర్వాత కాంగ్రెస్ తో విభేదించి,బయటకు వచ్చిన జగన్ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. గత ఎన్నికల్లో రెండు శాతం ఓట్లతో అధికారానికి దూరం అయిన జగన్ ఈసారి ఎలాగైనా అధికారం పొందాలని ఉవ్విళూరుతున్నారు.

తన తండ్రి డాక్టర్ వైఎస్ చేపట్టిన ప్రజా సంక్షేమ పధకాలు కొనసాగించాలన్నా, మరిన్ని జనరంజక పథకాలు ప్రవేశపెట్టాలన్నా అధికారం తప్పనిసరి. అందుకే వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా వ్యూహాలు రచిస్తుంటే, అధికార టిడిపి జగన్ పాచికలు పారకుండా ఎత్తులు వేస్తోంది. టిడిపి అధినేత, సీఎం చంద్రబాబుకి ధీటైన నేతగా ఎదిగి, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని చూస్తున్న జగన్ దృష్టి ఎన్నికలపైనే వుంది.

అయితే సిబిఐ కేసులను ప్రస్తావిస్తూ జగన్ ని టిడిపి ఆత్మరక్షణలో పడేస్తోంది. అసెంబ్లీ లో సిబిఐ కేసుల ప్రస్తావనతో పాటు జగన్ విద్యార్హతలను కూడా టిడిపి ప్రశ్నిస్తూ ఎద్దేవా చేసేది. అసలు జగన్ ఎంతవరకూ చదివాడో అంటూ చంద్రబాబు సైతం ఓసారి సందేహం వ్యక్తంచేయడం విశేషం. ఎందుకంటే తన క్యాలిఫికేషన్,ఇంగ్లీషు మాట్లాడే విధానంపై జగన్ సెటైర్ వేయడంతో చంద్రబాబు స్పందిస్తూ,;’అసలు జగన్ పరీక్షలు రాసినట్లు కనిపించడం లేదు.

అయితే టెన్త్, ఇంటర్ ,డిగ్రీలలో తానే ఫస్టని చెప్పుకుంటారు’అని పంచ్ వేశారు. దీంతో జగన్ తన విద్యార్హతల గురించి వివరిస్తూ,చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. అన్నింటా తాను ఫస్ట్ క్లాస్ సృండెంట్ అని చెబుతూ, చంద్రబాబులా ఇంగ్లీషును ఖూనీ చేయడం రాదని ఎటాక్ ఇచ్చారు. ఈవిధంగా ఇద్దరు నేతల మధ్యా సాగిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రచ్చ అసెంబ్లీలో ఆసక్తికరంగా ఉండేది.

మరి జగన్ అసలు ఏమి చదివారో వివరాల్లోకి వెళ్తే,కడప జిల్లా జమ్మలమడుగులో 1972లో పుట్టారు. సరిగ్గా అప్పుడే చంద్రబాబు బిఎ డిగ్రీ పూర్తిచేశారు. జగన్ బాల్యం పులివెందులలో గడించింది. అక్కడే ప్రాధమిక విద్య పూర్తిచేసి,ఆతర్వాత ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చేరారు. ఆసమయంలో డాక్టర్ వైఎస్ తన కుటుంబాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసారు. సిబిఎస్సి సిలబస్ ప్రకారం హెచ్ పిసి లోనే చదివిన జగన్ ప్రగతి మహావిద్యాలయ నుంచి బికాం డిగ్రీ అందుకున్నారు.

ఆతర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నత విద్య కోసం జగన్ ని డాక్టర్ వైఎస్ లండన్ పంపించారు. అక్కడ ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంబి ఏ లో చేరాడు. ఎందుకో మరి మధ్యలోనే ఆ కోర్సు వదిలేసి ఇండియా వచ్చేసారు. లండన్ లో తాను ఉడలేకపోతున్నట్లు జగన్ రచ్చ చేస్తే, అప్పటికపుడు అతన్ని డాక్టర్ వైఎస్ ఇండియా తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది.

అప్పటి నుంచి వ్యాపార రంగంలో ప్రవేశించి అనేక సంస్థలను విజయవంతంగా నిర్వహించాడు. ఇప్పటికీ ఎన్నికల అఫిడవిట్ లో జగన్ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీగానే పేర్కొంటారు. అయితే టిడిపి నేతల వాదన మరోలా ఉంటుంది. జగన్ చదువులో మొదటి నుంచీ వీకేనని,ఏదో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదవబట్టి ఆమాత్రం ఇంగ్లీషు అయినా వచ్చిందని సెటైర్ వేస్తుంటారు టిడిపి వాళ్ళు.