Movies

మాస్ మహారాజ్ రవితేజ జీవితంలో కొన్ని నమ్మలేని నిజాలు

టాలీవుడ్ లో మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ మాములుగా హీరో అవ్వలేదు. దానివెనుక ఎంతో కష్టం, శ్రమ వున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆతర్వాత సైడ్ రోల్స్ లో వేస్తూ ఆఖరికి హీరోగా నిలదొక్కున్నాడు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన ఇతని అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఈయన తల్లిదండ్రులు రాజగోపాలరాజు,రాజ్యలక్ష్మి. వీరికి ముగ్గురు సంతానం. రవితేజతో పాటు అతని సోదరులు రఘు,భరత్ కూడా సినిమాల్లోనే నటులుగా వున్నారు. గతంలోకి వెళ్తే,రాజగోపాలరాజు తమ పిల్లల చదువులకోసం విజయవాడ మకాం మార్చారు. దీంతో రవితేజ విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేసాడు.

డిగ్రీ చేసిన రవితేజ ఉపాధికోసం ఢిల్లీ, భోపాల్,ముంబయి,జైపూర్ తదితర ప్రదేశాలు చుట్టివచ్చినప్పటికీ , ఎక్కడా పని జరక్కపోవడంతో, హైదరాబాద్ వచ్చి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. చిన్న చిన్న వేషాలు వేసి, కొంతకాలం ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. 1989లో కృష్ణ వంశీ తీసిన సింధూరం మూవీలో బ్రహ్మాజీ తో పాటు సెకండ్ హీరోగా నటించాడు.

ఆ చిత్రంలో రవితేజ వేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఫాన్స్ కూడా వచ్చారు. ఆతర్వాత పలు సినిమాల్లో గుర్తింపు గల వేషాలు వేసినా,బ్రేక్ రాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 1999లో వచ్చిన తొలిసినిమా నీకొసంతో హీరోగా నటించి, నంది అవార్డు కూడా పొందాడు. అలా సోలో హీరోగా రాణిస్తున్న సమయంలో రవితేజను హీరోగా నిలబెట్టాడు పూరి జగన్నాధ్.

పూరి డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,లో నటించడంతో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆతర్వాత పూరి డైరెక్షన్ లోనే వచ్చిన ఇడియట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతేకాదు తర్వాత తీసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కూడా మంచి హిట్ ఇచ్చింది. పలు దర్శకుల తో కల్సి పనిచేసిన రవితేజకు డాన్ శీను, విక్రమార్కుడు,వెంకీ, కృష్ణ, కిక్, రాజా ది గ్రేట్,ఇటీవల నేల టికెట్ మూవీలతో టాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. ఇక రవితేజ ఫామిలీ విషయానికి వస్తే, అతని భార్య కళ్యాణి. ఇద్దరు సంతానం. కూతురు పేరు మోక్షద,కొడుకు పేరు మహాధన్. అదండీ రవితేజ లైఫ్.