Healthhealth tips in telugu

Good Sleep:ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే…వీటిని పాటించాల్సిందే

Good Sleep:మారుతున్న జీవనశైలిలో చాలా మందిని వేదించే సమస్య నిద్రలేమి అని చెప్పవచ్చు. ఈ పరిస్థితి లేకుండా కంటి నిండా నిద్ర ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతసేపు నిద్ర పోతున్నామో లెక్కలు వేసుకోవటం ఎంత ముఖ్యమో, ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవటం కూడా అంతే ముఖ్యం. లేకపోతె నిద్రలేమి సమస్య తప్పకపోవచ్చు.

అందుకే తగిన వేళలు నిర్ణయించుకొని తప్పనిసరిగా అనుసరించాలి. నిద్ర పోయేముందు ఆకలితో పడుకోవటం లేదా అతిగా తినటం చేయకూడదు. సరిగ్గా తినకుండా పడుకుంటే మధ్య రాత్రి మెలుకువ వస్తుంది. అతిగా తింటే జీర్ణం కాకా నిద్ర పట్టదు. అందుకే తేలికపాటి మితాహారం తీసుకోవాలి.

పగటి పూట అరగంట నిద్ర మంచిది. అలాగని అరగంట మించిన నిద్ర రాత్రిళ్ళు నిద్రలేమికి కారణం అవుతుంది. పనిలో విరామం కోసం కొంత సేపు నడుము వాల్చటం మంచిదే. కానీ ఆ నిద్ర మధ్యాహ్న భోజనంనకు ముందు ఉంటే మంచిది.

శరీరానికి కావలసినంత పోషకాహారం మరియు తగినంత వ్యాయామం ఉంటే అప్పుడు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అప్పుడు చక్కని నిద్ర పడుతుంది. ఇంటి పనులతో సంబంధం లేకుండా రోజు ఒక అరగంట వ్యాయామం చేయాలి. దీని వలన చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అలాగే మంచి గాడనిద్ర పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.