Movies

కిరీటి ఎలిమినేషన్ లో అతి పెద్ద తప్పు చేసిన ఇంటి సభ్యులు

బిగ్ బాస్ షో లో కొత్త కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా కిరీటి ఎలిమినేషన్ విధానం పెద్ద వివాదాన్నే రాజేస్తోంది. సగటు ప్రేక్షకుడు గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. కిరీటి ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు , హోస్ లో సభ్యులంతా రాముడు మంచి బాలుడు అన్న చందంగా ‘కిరీటి మంచి వాడు,కౌశల్ తో ఘటన పొరపాటున జరిగిపోయింది. అతను హౌస్ లోంచి వెళ్ళిపోయినా కిరీటి ఇప్పటికే మా గుండెల్లో ఉంటాడు’అనే అర్ధం వచ్చేలా ఆకాశానికి ఎత్తేసారు. అంతవరకూ బానే వుంది. అయితే ఈ వ్యవహారాలను గమనించిన సగటు ప్రేక్షకుడు కొన్ని సంచలన విషయాలు లేవనెత్తాడు. ఇక్కడే పెద్ద తప్పు జరిగిపోయిందని సగటు ప్రేక్షకుడు నిలదీస్తున్నాడు.

ఎందుకంటే గతవారం ఎలిమినేషన్ రౌండ్ లో కిరీటి పేరు చెప్పి అందు కోసం రకరకాల కారణాలు ఎత్తిచూపారు. ఆ సమయంలో కౌశల్ తో కిరీటి చేసింది చిన్నతప్పు అని భావించకుండా, పెద్ద తప్పుగా చూపించారు. మరి ఇప్పుడు హౌస్ మెంబర్స్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని, అసలు ఎందుకీ కపట ప్రేమ అని సగటు ప్రేక్షకుని ప్రశ్న.

మరి కిరీటి నిజంగా మీ మనస్సుకి హత్తుకునే వాడే అయితే ఎందుకు నామినేట్ చేసారు,ఇక గత వారం కెప్టెన్సీ టాక్ జరిగితే , కిరీటిని హౌస్ మెంబర్స్ పెద్దగా ప్రోత్సహించలేదు, అండగా నిలవలేదు అంటూ ఈ వ్యవహారాలు చూసిన ప్రేక్షకులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

అసలు డబుల్ గేమ్ కిరీటి ఆడాడా, ఇప్పుడునం ఇంటి సభ్యులే డబుల్ గేమ్ ఆడుతున్నారా అని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఇక ఈవారం బిగ్ బాస్ సీజన్ షోలో ఇలాంటి విచిత్రాలు ఎన్ని చోటుచేసుకుంటాయో చూడాలని అందరూ అనేమాట.