Movies

తెలుగువారు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నగోవా బ్యూటీ ఇలియానా

తెలుగునాట ఎందరో బయటనుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ సూపర్ లెవెల్లో ఆదరణ చూరగొంటారు. కొందరు ఇక్కడ వచ్చే ఆదరణ చూసి ఇక్కడే స్థిరపడిపోతుంటే మరికొందరు బాలీవుడ్ కో,మరోచోటికో వెళ్లిపోతుంటారు. అయితే నిన్నమొన్నటి వరకూ టాలీవుడ్ లో సక్సెస్ రేటు చూసిన ఇలియానా మళ్ళీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తోంది. పైగా ఈమెకు హైలెవెల్లో గౌరవం కూడా అందడంతో ఇక ఆనందానికి అవధుల్లేవట. అసలు ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఈ గోవా బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్,రవితేజా ఇలా తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించింది.

తెలుగులో నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చాక, బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే అక్కడే ఆమెకు పతనం ప్రారంభమైంది. నిజానికి మొదట్లో బాలీవుడ్ లో వరుస అవకాశాలు కొట్టేసిన ఇలియానా,ఆతర్వాత సన్నగిల్లాయి. ఎందుకంటే కొన్ని హిట్స్ అయినప్పటికీ ఎక్కుగభాగం ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈమెను అసలు పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఏరి కోరి బాలీవుడ్ కి వెళ్లిన ఈ గోవా సుందరి కి ఛాన్స్ లు తగ్గిపోవడం, అసలు పట్టించుకోకపోవడం వలన డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఫిజీ లాంటి దేశాలకు వెళ్లి బీచ్ లో సేదదీరుతూ గడిపిసింది. అయితే అనుకోని విధంగా ఈ గోవా ముద్దుగుమ్మకు మళ్ళీ టాలీవుడ్ నుంచే అవకాశం వచ్చింది. సెన్షేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది.

ఇందులో మాస్ మహారాజు రవితేజా హీరో. బాలీవుడ్ కి వెళ్లిన ఈమె ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుందా, ఏమిటి అంటూ ఆలోచిస్తుంటే, అవకాశాలు లేనందున పెద్దగా ఆమె కూడా డిమాండ్ చేయకపోవడంతో చివరకు ఆమెను ఎంపిక చేసారు. ఇక మొదటి రోజు షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన ఆమెకు కళ్ళు జిగేల్ మనేలా స్వాగతం పలికారట చిత్ర యూనిట్ బృందం.

భారీగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఓ యువరాణిలా ఆమెను చూసుకుంది. ఊహించని విధంగా మంచి హోటల్ రూమ్, సకల సౌకర్యాలు ఏర్పాటుచేయడంతో ఆమె ఈ పరిణామానికి షాకయ్యిందట. ఎందుకంటే బాలీవుడ్ కి వెళ్లి, అక్కడ అవకాశాలు దెబ్బతినడం, మళ్ళీ చాన్నాళ్ల తర్వాత తెలుగులో నటించడం వలన ఎలా ట్రీట్ చేస్తారోనని భయపడిందట.

తీరా ఊహించని విధంగా స్వాగతం పలకడంతో ఆమె కంట ఆనంద భాష్పాలు రాలయట. తనకు ఆపూర్వ ఆదరణ పలికి, తనను నెత్తిన పెట్టుకున్న చిత్రం యూనిట్ కి ఆమె మనసారా కృతజ్ఞతలు తెల్పింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ చూపిస్తున్న ఆదరణతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.