Movies

బుల్లితెర యాంకర్ ఓంకార్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…. తండ్రి ఎవరో తెలుసా?

బుల్లితెర యాంకర్ గా ఎంతోమందికి ఉపాధి కల్పించి, సినీ రంగంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఓంకార్ అంటే తెలియని వారుండరు. టెలివిజన్ యాంకర్ స్థాయినుంచి తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ గల దర్శకునిగా కోట్లాదిమంది ప్రజల్లో పేరుతెచ్చుకున్న ఓంకార్, ఇంత అద్భుతం సాకారం చేసుకున్నాడు. డాన్స్ రియాల్టీ షోతో బుల్లితెరమీద అన్నయ్య అని పిలిపించుకున్న ఓంకార్, ఆ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ కొరియాగ్రాఫర్లను అందించాడు. ఆట ప్రోగ్రాం తో ఆగిపోకుండా జీనియస్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, తొలిచిత్రం కలిసిరాకపోయినా కుంగిపోలేదు. కసిగా మళ్ళీ తన సత్తా చాటే ప్రయత్నం చేసాడు. అలా చిన్న చిత్రం రాజుగారి గదిలో హిట్ కొట్టిన ఓంకార్, తానేమిటో చాటిచెప్పాడు. ఆతర్వాత నాగార్జున తో ‘రాజు గారి గది -2’ డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

క్రియాటివ్ ఆలోచనలతో టెలివిజన్ రంగంలో ఇమేజ్ బిల్డప్ చేసుకున్న ఈ కాకినాడ బుల్లోడు, సినీ రంగంలో కూడా అదే ఒరవడిలో దూసుకెళ్తున్నాడు. ఇక ఇతని బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తా, అతని త్రండి కృష్ణారావు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మంచి హస్తవాసి గల ఫేమస్ డాక్టర్. అయితే తండ్రి పెద్ద డాక్టరైనా సరే, కేవలం కాకినాడకు పరిమితం కావడం తో ఓంకార్ లో కొత్త ఆలోచనకు తెరలేచింది.

వినూత్నంగా అందరికీ తెలిసేలా ఎదగాలని భావించిన ఓంకార్,అందుకనుగుణంగా క్రికెట్ లో గాని, సినిమాల్లో గానీ ఎదగాలని ఆలోచించేవాడు. అయితే తండ్రి కోరికపై క్రికెట్ పక్కన పెట్టేసి, ఫిజియో థెరపీ కోర్సు పూర్తిచేసిన ఓంకార్, హైదరాబాద్ నాంపల్లి మెడ్విన్ హాస్పిటల్ లో నాలుగేళ్లు ఫిజియో థెరపిస్టుగా సేవలు అందించాడు. ఆతర్వాత ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా రంగప్రవేశం చేసిన యాంకర్, సొంతంగా ప్రోగ్రామ్స్ రూపొందించే స్థాయికి చేరాడు.

ఇక జి తెలుగులో ఆట ప్రోగ్రాం తో తెలుగు రాష్ట్రాల్లో ఓంకార్ పేరు మారుమోగిపోయింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఆ కార్యక్రమంతో ఓంకార్ అన్నయ్యగా రూపాంతరం చెందాడు. అయితే తండ్రికిచ్చిన మాటప్రకారం క్రికెట్ ని పక్కనపెట్టిన ఓంకార్ తనకిష్టమైన సినీరంగాన్ని మాత్రం వదల్లేదు. ఎంతోకష్టపడి జీనియస్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే , అది తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో పట్టువదలని విక్రమార్కునిలా ‘రాజుగారి గది’ చిత్రం తో అద్భుత విజయాన్ని సాధించిన ఓంకార్, ఆతర్వాత నాగ్ కోసం ‘రాజు గారి గది’సీక్వెల్ చేసి, విజయాన్ని అందుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఇక టివి రంగానికి రీ ఎంట్రీ ఇచ్చి,’సిక్స్ సెన్స్ ‘కార్యక్రమంతో అదరగొట్టేస్తున్నాడు. స్టార్ మా లో ఈ ప్రోగ్రాం కి వచ్చే టి ఆర్పీ రేటింగ్ ఓంకార్ ఘనతను చాటుతోంది. ఇక ఓంకార్ కి ఓ సోదరుడు వున్నాడు. అతని పేరు అశ్విన్. మంచి డాన్సర్ , నటుడు కూడా. ఆవిషయం ‘రాజు గారి గది ‘తో రుజువైంది. తనమేనమామ కూతురిని పెళ్లాడిన ఓంకార్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వడమే కాకుండా తన సోదరుణ్ణి కూడా ఎంకరేజ్ చేస్తూ, పైకి తీసుకొస్తున్నాడు.