Politics

పవన్ త్రివిక్రమ్ కలిసిపోయారు…. వారిని కలిపిన ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ఇద్దరు ఆత్మీయులు విడిపోతే, వాళ్ళను మరింత దూరం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే, మరికొందరు మాత్రం మళ్ళీ వాళ్ళని దగ్గరకు చేర్చే సాహసం చేసి సక్సెస్ అవుతారు. ఇలా సక్సెస్ సాధించినవాళ్లు టాక్ ఆప్ ది టౌన్, టాక్ ఆఫ్ ది సిటీ, టాక్ ఆప్ ది ఇండస్ట్రీ గా మారతారు. టాలీవుడ్ లో ఓ ఘటన చూస్తే, సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. అదిమిటంటే, అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నడుమ చాలా దూరం ఏర్పడిందనే టాక్ బలంగా వినిపిస్తూ వస్తోంది. అయితే గుప్పుమన్న ఈ వార్తలను త్రివిక్రమ్ ఖండించినా సరే,ఇంకా వస్తూనే వున్నాయి. అయితే వీల్లద్దరినీ కలిపిన ఘనత సౌజన్య శ్రీనివాస్ కి దక్కింది.

అది ఎలా అంటే,సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్. ఈమె భరత నాట్య ప్రదర్శన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ తన భార్య అన్నాతో కల్సి హాజరవ్వడమే కాదు, ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆహ్లాదకరంగా వీక్షించడం హాట్ టాపిక్ అయింది. ఈ కార్యక్రమంలో పవన్, త్రివిక్రమ్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరి పక్కన ఒకరు ఆశీనులవ్వడం తో పాటు ఆత్మీయంగా వీరు ముగ్గురూ సంబాషించుకోవడం మీడియా కెమెరాలకు విపరీతమైన డిమాండ్ ని ఏర్పడేలా చేసింది.

సో, ఈ ఘటనతో పవన్, త్రివిక్రమ్ ల నడుమ సాన్నిహిత్యం ఏ మాత్రం చెడిపోలేదనే సంకేతాలు బలంగా పంపినట్లయింది. నిజానికి ఆ మధ్య నితిన్ చల్ మోహన్ రంగా ఆడియో ఫంక్షన్ కి పవన్ రావడం,త్రివిక్రమ్ హాజరవ్వకపోవడం నేపథ్యంలో వీరిద్దరి మధ్యా సంబంధాలు బెడిసికొట్టాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఆవన్నీ ఒట్టి పుకార్లేనని త్రివిక్రమ్ భార్య సౌజన్య డాన్స్ ప్రోగ్రాం ద్వారా లోకానికి తేటతెల్లం అయ్యింది.

కాగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆయా జిల్లాల్లో సాగిస్తున్న రాజకీయ యాత్రలలో ఇస్తున్న స్పీచ్ లలో పసలేదని కూడా వినిపిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో పవన్ ప్రసంగాల వెనుక త్రివిక్రమ్ ఉంటాడనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు మిత్రులను కల్పిన ఘనత సొంతం చేసుకున్న సౌజన్య శ్రీనివాస్ దక్కడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."