Movies

వరుణ్ హిట్….తేజు ప్లాప్…. ఇద్దరిలో తేడాలు ఏమిటో తెలుసా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సరే పిల్లా నీవు లేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ఆ సినిమాలో మంచి జోష్ కనబరిచాడు. ఆ తర్వాత చేసిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కూడా మంచి ఫలితాన్ని అందించింది మెగా మేనల్లుడికి. ఆ తర్వాత సుప్రీం సినిమాతో టాలీవుడ్ లో హీరోగా నిలబడటమే కాకుండా సుప్రీం హీరో అనే బిరుదు తగిలించేసారు మెగా అభిమానులు. ఇక అక్కడి నుండి తేజు ప్లాప్ ల పరంపర కొనసాగింది. తిక్క,విన్నర్,నక్షత్రం,జవాన్,ఇంటిలిజెంట్ ఇలా వరుస ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దాంతో సాయి ధరమ్ రేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తేజు I LOVE U సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు.

అయితే సినిమా పెద్ద సూపర్ హిట్ కాలేదు. కానీ గత సినిమాల మీద బెటర్ అనిపించింది. అయితే మెగా మేనల్లుడి సినిమాలు ప్లాప్ కావటానికి కథల ఎంపిక సరిగా లేకపోవటమే అని అంటున్నారు. కథల ఎంపిక అనేది తేజు స్వయంగానే నిర్ణయం తీసుకుంటాడు. తన మీద తనకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్లాప్ లకి కారణం అని తేజు సన్నిహితులు అంటూ ఉంటారు.

మెగా హీరోలతో కథల గురించి చర్చించి తేజు ముందుకి సాగితే బెటర్. లేకపోతే మరల పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. మరోపక్క వరుణ్ తేజ్ సినిమా సినిమాకి సంబంధం లేకుండా కథలను ఎంచుకొని హిట్ కొడుతూ ముందుకు సాగుతున్నాడు.