ధోని భార్య సాక్షి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ M.S.ధోని గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఎంత ఒత్తిడిలో ఉన్న చాలా కూల్ గా ఉంటాడు ధోని. అందుకే ధోనిని అందరూ ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని జూలై 4, 2010 న సాక్షిని వివాహం చేసుకున్నాడు. సాక్షి నవంబరు 19, 1986 న జన్మించింది. ఆమె తండ్రి కనోయి గ్రూప్ యొక్క బినాహరి టీ సంస్థలో పనిచేసేవారు. సాక్షీ డెహ్రాడూన్ లో వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ జరిగింది. ఔరంగాబాద్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందింది. ఆమె తన శిక్షణను కోల్కతాలోని తాజ్ బెంగాల్ ఆఫీసులో పూర్తి చేసింది.ధోని,సాక్షి ఇద్దరూ రాంచీలోని DAV శ్యామలీ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.

ఇద్దరి కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉండేవి. కొంత కాలం తర్వాత సాక్షి కుటుంబం తండ్రి ఉద్యోగ రీత్యా డెహ్రాడూన్ కి వెళ్ళిపోయింది. ఆమె హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.2007 లో ఇండియన్ క్రికెట్ జట్టు కొలకత్తాలోని తాజ్ బెంగాల్ లో బస చేసినప్పుడు సాక్షి,ధోని తొలిసారి కలుసుకున్నారు.

ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ పై మ్యాచ్ ని ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. అదే రోజు సాక్షి ఇంటర్న్ షిప్ చివరి రోజు. ఆలా వారి చిన్ననాటి స్నేహం చిగురించి ప్రేమగా మారి 2010 లో డెహ్రాడూన్ సమీపంలోని విక్రాంతి రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప జీవా. ధోని తన ఖాళీ సమయం అంతా కూతురితోనే గడుపుతాడు. ధోని తన కూతురు తన జీవితంలోకి వచ్చాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పుతూ ఉంటాడు.