Movies

కమెడియన్ అలీ సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

అలీ బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి ఆ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. వాటిలో కొన్ని సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత పరాజయాలు రావటంతో హీరో ట్రాక్ వదిలేసి మరల కమెడియన్ గా మారి సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. అలీ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా బిజీగా ఉన్నాడు. ఆలా రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అలీ సంపాదన ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. అలీ ఆస్థి దాదాపుగా 500 కోట్లకు పైగానే ఉంటుందట. డబ్బును దాచి అపుడప్పుడు కొంత మొత్తాలతో స్థలాలను కొనేసాడట. ఆ స్థలాలు అన్ని బాగా పెరిగిపోవటంతో అలీ ఆస్థి అంతలా పెరిగిందట.

అలీ ఎంతలా ఎదిగిన ఎప్పుడు ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు. చిన్న నిర్మాతకు ఎంత గౌరవం ఇస్తాడో పెద్ద నిర్మాతకు కూడా అంతే గౌరవం ఇస్తాడు. అందుకే సినీ పరిశ్రమలో అలీని ఇష్టపడని వారు ఎవరు ఉండరు.