Movies

శ్రీకాంత్ కూతురు గురించి ఈ కొత్త విషయం మీకు తెలుసా?

విలన్ గా ఎంట్రీ ఇచ్చి, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి, హీరో రేంజ్ సొంతం చేసుకుని సెటిల్ అయ్యాడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీకాంత్. అయితే ఇప్పుడు ఛాన్సులు లేకపోవడంతో మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ భార్య ఊహ మంచి నటిగా రాణించింది. శ్రీకాంత్ , ఊహ దంపతులకు ముగ్గురు సంతానం.పిల్లలు ముగ్గురూ కూడా సినీ కళామతల్లికి సేవలో మునిగారు. పెద్ద కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరికొన్ని మూవీస్ చేయబోతున్నాడు కూడా. రెండో కొడుకు రోహన్ సైతం ప్రభుదేవా ఓ త్రిభాషా చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇక కూతురు మేధ కూడా చిన్నారి రుద్రమదేవిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక మేథ గురించి లేటెస్ట్ గా తెల్సిన విషయం ఏమిటంటే ఈమె బాస్కెట్ బాల్ లో జాతీయ స్థాయి క్రీడాకారిణి గా రాణిస్తోంది. శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా స్వయంగా తన నట వారసుల గురించి చెబుతూ శ్రీకాంత్ తన కూతురు గురించి కొత్త విషయం చెప్పాడు. ‘నా కూతరు మేథ బాగా చదువుతుంది.

చదువు తప్ప తనకు ఏ ధ్యాస లేదు. బాస్కెట్ బాల్ కూడా బానే ఆడుతుంది. నేషనల్ బాస్కెట్ బాల్ టీమ్ కి కూడా ఎంపికైంది’అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ, సినిమాల్లో కూడా నటిస్తున్న మేథ ను ఇండస్ట్రీ ప్రముఖులు అభినందిస్తున్నారు.