రామ్ చరణ్ భార్య ఉపాసన వెంట తెచ్చుకున్న ఆస్తి విలువ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు తెలుగు అగ్ర హీరోల్లో ఒకడిగా నిలిచాడు. తండ్రి నుంచి మెగా, బాబాయ్ నుంచి పవర్ స్టార్ ట్యాగ్ లైన్ అందుకుని మెగా పవర్ స్టార్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ రేంజ్ లో అందుకున్నాడు. ఎవరికైనా తొలి చిత్రం అందించే కిక్కేవేరు. అందుకే మొదటి చిత్రం హిట్ కావాలని అందరూ కలలు కంటారు. ఇక పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఆ మూవీలో చెర్రీ నటన కు ఫైట్స్, పాటలకు ఫిదా అయ్యారు ఫాన్స్.ఇక రామ్ చరణ్ ఏంటన్నది ఈ మధ్య వచ్చిన రంగస్థలం మూవీ ప్రూవ్ చేసింది. నిజానికి 80వ దశకం నాటి కథాంశంతో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసాడు చెర్రీ.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో చరణ్ చేరిపోయాడు. ఇక పర్సన్ లైఫ్ విషయానికొస్తే, అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనితో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టెంపుల్ హౌస్ లో 2012లో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.పవన్ కళ్యాణ్ ప్రాణస్నేహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో పెళ్లి మండపం డిజైన్ చేయడం విశేషం. రామ్ చరణ్ కి అత్తమామలు కట్నంగా 350కోట్లు ఇచ్చినట్లు బోగట్టా.
అంతేకాదు చాలా చోట్ల ఖరీదైన భూములు , కొన్ని ఫ్లాట్స్ లాంఛనంగా ఇచ్చారట. ఇక చెర్రీ ఉపాసన పేరెంట్స్ బహుకరించిన ఆస్టిన్ మార్టిన్ కారు మరో ఎత్తు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే ఈ కారు గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తుంది. ఇక ఈ కారు ఖరీదు రెండు కోట్ల రూపాయలుంటుంది.
ఇక పెళ్లి విషయానికి వస్తే, చిరంజీవి పరిచయం దృష్ట్యా మలయాళ చిత్ర పరిశ్రమ వరకూ దాదాపు అన్ని భాషా చిత్రాల నటీనటులు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు అన్ని పార్టీల ప్రముఖులు చెర్రీ పెళ్ళిలో సందడి చేసారు.