Movies

ఎవరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్… ఆ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు?

పూర్వం ఏ రంగం లో వున్నవాళ్లు ఆ రంగానికే పరిమితం అయ్యేవారు. రాను రాను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలవైపు దృష్టి సారించడం మొదలైంది. ఇక సినీ హీరోల విషయానికి వస్తే,ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు స్టూడియోలు, థియేటర్లు కట్టారు. శోభన్ బాబు,మురళీమోహన్ వంటి హీరోలు భారీగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు గడించారు. మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున వంటి హీరోలు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సీనియర్లే కాదు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఇటీవలే దుస్తుల వ్యాపారం మొదలు పెట్టాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బిజినెస్ రంగంలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ థియేటర్ ల రంగంలోకి దిగడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా థియేటర్ల నిర్మాణం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక్ ఆ డబ్బులతో భారీగా ప్లాట్స్, భూములు కొనుగోలు చేసాడు. ఇక మల్టీ ప్లెక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాడు. ఇప్పటికే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆయా ప్రాంతాల్లో థియేటర్ల రంగంలో పెట్టుబడులు పెట్టి దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు ఆయన చేతులో వున్నాయి.

అందుకే ఈ వ్యాపారం గురించి తెల్సుకున్న తారక్ దీనిపై భారీస్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఎపి,తెలంగాణా రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీ ప్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు భారీ ఎత్తున ప్రణాళిక రచించినట్టు తెల్సింది. తమ చేతిలో డబ్బులున్నప్పుడే భూములు, ఇతర వ్యాపారాల్లో హీరోలు, సినీ ప్రముఖులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు తీసి, లాభాలు గడించిన వారికన్నా నట్టేట మునిగినవాళ్ళే ఎక్కువమంది వున్నారు.

ఇక ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఎన్నో భారీ బడ్జెట్ హిట్ చిత్రాలు తీశారు. కానీ ప్రస్తుతం ఆయన తన కొడుకు సుమంత్ అశ్విన్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ కూడా తీయలేని దయనీయ పరిస్థితిలో వున్నాడు. విషయం తెల్సుకున్న హీరో ప్రభాస్ ముందుకొచ్చి సుమంత్ అశ్విన్ హీరోగా హ్యాపీ వెడ్డింగ్ మూవీని తన బ్యానర్ లో తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు చూసాక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడికి అనుగుణంగా గతంలో కొందరు వ్యవహరిస్తే,సో ఇప్పటి హీరోలు కూడా అదే బాట పడుతున్నారు.