Movies

విజేత హీరోయిన్ మాళవిక నాయర్ గురించి బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్ ఆ తర్వాత కల్యాణ వైభోగమే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరయింది ఈ భామ. ఇప్పుడు విజేత సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి చిన్నల్లుడు అంటే చిన్న కూతురు శ్రీజ భర్త హీరోగా విజేత సినిమా నిన్న విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తండ్రి,కొడుకుల ఎమోషనల్ డ్రామాలో మాళవిక నాయర్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రను పోషించింది. విజేత సినిమాలో మాళవిక నాయర్ నటనకు విమర్శకుల సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మలయాళీ అమ్మాయి అయిన మాళవిక నాయర్ మైనారిటీ తీరక ముందే ఎన్నో సినిమాలను చేసింది. మాళవిక తల్లితండ్రులు ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడ్డారు.

మాళవిక నాయర్ 1998 సంవత్సరంలో జనవరి 4 న ఢిల్లీలో జన్మించింది. మాళవిక నాయర్ ఢిల్లీలోనే CBSE సిలబస్ తో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. చదువుతున్న సమయంలోనే ఎన్నో యాడ్స్ లో నటించింది ఈ కేరళ భామ.

13 సంవత్సరాల వయస్సులోనే ఉస్తాద్ హోటల్ వంటి సినిమాల్లో నటించింది. మాళవిక నటించిన ఒక తమిళ సినిమాలో అంధురాలిగా నటించింది. ఆ సినిమా హిట్ కావటంతో ఆ సినిమాను చూసిన నాగ్ అశ్విన్ తన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి మాళవిక నాయర్ ని తీసుకున్నాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా హిట్ కావటంతో కల్యాణ వైభోగమే సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తీసిన సావిత్రి బయో పిక్ లో కూడా మాళవిక నాయర్ కి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె చేస్తున్న టాక్సీ వాలా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విజయ దేవరకొండ హీరోగా నటించటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.