Devotional

ఆషాడ మాసంలో ఏ పనులు చేయాలి…. చేయకూడని పనులు చేస్తే ఏమౌతుందో తెలుసా?

మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధ్యాన్యత వుంది. ఇక ఈ ఏడాది ఆషాడం జూలై 14న మొదలైంది. ఆగస్టు 11వ తేదీ వరకూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నెలను ఆషాడం అంటారు. దీన్ని సూన్య మాసం అని పెద్దలు చెబుతారు. అందుకే శుభ కార్యాలకు అనుకూలం కాదు ఈ మాసం అని చెబుతారు. ఇక వర్ష ఋతువు కూడా ఈమాసంలోనే స్టార్ట్ అవుతుంది. ఈనెలలో చేసే దానాలు, స్నానాలు మంచి ఫలితాన్నిస్తాయని అంటారు.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఆషాఢంలోనే దక్షిణాయనం మొదలవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే దాకా దక్షిణాయనం అంటారు. ఆషాడ శుద్ధ విదియనాడు పూరీ జగన్నాధ రథయాత్ర జరుగుతుంది. ఇక ఆషాడ సప్తమిని భాను సప్తమి అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఇదే ఆషాడంలో తెలంగాణలో బోనాల ఉత్సవం మొదలవుతుంది.

మహంకాళి అమ్మవారికి తయారు చేసే భోజనాన్ని బోనం అని పిలుస్తారు ఇక అమ్మవారికి నివేదన చేసే పర్వ దినాన్నే బోనాల పండగ అంటారు.
ఇక ఆరోజుల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండడం వలన, యువకులు అత్తారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు ముందుకు సాగవు. వర్షాలకు తగ్గట్టు విత్తనాలు జల్లుకోవాలి. కనుక ఆషాడంలో కూర్చుంటే ఇబ్బంది కనుక ఎదురు బొదురు పడకూడదని అనేవారు. ఇక ఆరోజుల్లో కాల్వలు, పంపులు ద్వారా కూడా నీరు వచ్చేది కాదు. వ్యవసాయానికి ఇబ్బంది ఉండకూడదని అత్తవారింటికి వెళ్లకూడదని కొత్త అల్లుళ్లకు రూలు పెట్టారు మన పెద్దలు.

ఇక ఇంటి మీద ధ్యాసతో పనులు మానేస్తారనే ఉద్దేశ్యంతో ఆషాడ నియమం పెట్టారు. అలాగే,ఆషాడం ఆనారోగ్య మాసం. కొత్తనీరు ప్రవేశించడం, అది తాగడం వలన విరోచనాలు, చలిజ్వరం తలనొప్పి మొదలైన రోగాలు వస్తాయి. ఇక స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూల మాసం కాదు. అశుభ సమయాల్లో, అనారోగ్య సమయంలో గర్భ ధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది.ఇలా అనేక కారణాల వలన ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఇక ఈమాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు.

ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు. ఇక ఈ మాసంలో చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలూ చేస్తారు. ఇక ఈ మాసంలో మనిషిలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అందుకే ఆషాడం అనే నియమం పెట్టారు. ఇక దీక్షలు కూడా ఈమాసాల్లోనే మొదలవుతాయి. ఎండా కాలం వేడిమికి భూ తాపం హెచ్చి వర్షాకాలంలో భూమిలోకి నీరు ఇంకుతుంది. అందుకే ,తద్వారా పండే కూరగాయలను తినకూడదని నియమం పెట్టారు.

ఇక చాతుర్మాస్య రెండవ మాసం శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు. మూడవ నెల భాద్రపద మాసంలో పాలను తాగకూడదు. చివరి మాసం ఆశ్వయుజ మాసంలో కంది,పెసర, సెనగ మొదలుగు పప్పు ధాన్యాలు తినకూడదని పెద్దలు నియమం పెట్టారు.ఈ మాసంలో వచ్చే క్రిమి కీటకాదులు పోవాలంటే, కనీసం మూడు సార్లు అయినా ఆవు పేడతో కాల్చిన పిడకలతో ధూపం వేయాలి. మైసాక్షి వంటి ధూపాన్ని ఇంట్లో వేస్తే,క్రిమి కీటకాలు నివారించబడతాయి. ఇక ఈ కాలంలో వేప, మామిడి, జామ,మొదలైన మేలు చేసే పండ్ల మొక్కలు నాటాలి.