Movies

వడ్డే నవీన్ కెరీర్ పతనానికి కారణం ఎవరు….ఇప్పుడు ఏమి చేస్తున్నాడు

ఏ రంగమైనా రాణించినంతకాలమే గౌరవిస్తారు .. అందలం ఎక్కిస్తారు .. దెబ్బతింటే మాట్లాడనైనా మాట్లాడారు. ఇక సినీ రంగమైతే హిట్స్ ఉంటే ఆకాశానికి ఎత్తేస్తారు. ప్లాప్ లు మొదలయ్యాయంటే ఇక ఎవరూ కన్నెత్తి చూడరు. అందుకే రాశి కంటే వాసి ముఖ్యమని టాలీవుడ్ లో పేరుంది. హిట్స్ అంటూ లేకపోతే అసలు ఆ వ్యక్తి ఉన్నాడా లేడా అని తెలీదు. అందుకు తార్కాణం హీరో వడ్డే నవీన్. ఒకప్పుడు యూత్ ఫాలోయింగ్ ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలీనంతగా తెరమరుగయ్యాడు.ఎన్నో హిట్ చిత్రాలు అందించిన స్టార్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ తనయుడైన నవీన్ ఒక కెరీర్ ని మించి ఎదగలేకపోయాడు. ఇక అతని వైవాహిక జీవితం కూడా సమస్యల వలయమేనని వినిపిస్తోంది. కోరుకున్న ప్రియుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నవీన్, మొదట్లో దూకుడు కనబరించినా, తర్వాత వెనుకబడిపోయాడు.

1997లో ఏకంగా 5చిత్రాల్లో చేసిన ఇతను కోరుకున్న ప్రియుడు,పెళ్లి,ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు,వంటి చిత్రాలతో ఓ దశలో యువ హీరోలకు పోటీగా నిలిచాడు. ఇక అప్పట్లో మనసిచ్చి చూడు,నాహృదయంలో నిదురించే చెలి,బాగున్నారా, చాలా బాగుంది వంటి చిత్రాలతో నవీన్ రేంజ్ అమాంతం హెచ్చింది. ఇక నవీన్ పక్కన సపోర్టింగ్ యాక్టర్ గా రవితేజ వంటి వాళ్ళు నటించారు. సక్సెస్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. సరిగా ఇక్కడే నవీన్ దెబ్బతిన్నాడు.

పోటీలో గల ఇతర హీరోలతో ధీటుగా తనను తాను మలుచుకోవడంలో విఫలమవడం కథల ఎంపికలో ఫ్రెష్ నెస్ కి ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో నవీన్ 2000 తర్వాత వడ్డే నవీన్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఒక్క మూవీ రాలేదు. ఇక వచ్చిన మూవీలు కూడా అతని ఇమేజ్ కి దూరంగా ఉండడం కూడా అతన్ని అభిమానులకు క్రమంగా దూరం చేసాయి. ఇక నవీన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎన్టీఆర్ మానవరాలని తెలుస్తోంది.

అయితే వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోయాడని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇక తండ్రి రమేష్ కూడా కొన్నాళ్ల క్రితం కన్ను మూసాడు. ఇక పెద్ద దిక్కు కోల్పోయి,సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఇంటికి పరిమితం అయ్యాడు. ఇప్పటికీ అదే బాడీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్న నవీన్ ఇటీవల టి సుబ్బరామిరెడ్డి ఇంట్లో పెళ్ళిలో అందరూ చూసి షాక్ అయ్యారు. ఇంచక్కా హీరోగా వేయచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేశారట. అయితే హీరోగా చేయబోనని చెప్పేసిన నవీన్,ఇక జగపతి బాబు రూట్ లో రోల్స్ వేయాలని భావిస్తున్నట్టు బోగట్టా.

రెండేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎటాక్ మూవీలో ప్రకాష్ రాజ్ కొడుకుగా వేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మంచు విష్ణు మూవీలో విలన్ గా నటిస్తున్నాడట. తండ్రికి వందల లారీలున్నా, సినీ రంగంలో అతి పెద్ద పంపిణీ సంస్థ వున్నా,తాను చేయాల్సిన పని తాను చేయకపోవడం వలన నవీన్ తన పతనాన్ని తానె రాసుకోవడం అందరికీ ఓ గుణపాఠం లాంటిది. తండ్రి పలుకుబడిని వినియోగించుకుని, మంచి డైరెక్టర్లను గ్రిప్ లో పెట్టుకుని, మంచి కధలను ఎంచుకుని ఉంటే నవీన్ కి ఈ పరిస్థితి వచ్చేదికాదని సినీ జనాలు అనే మాట.