Movies

RX 100 సినిమా హీరోయిన్ పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ,పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా RX 100 సినిమా తెరకెక్కింది. విడుదల అయినా అన్ని సెంటర్స్ లోను హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ గా రన్ అవుతుంది. ప్రసుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ ఎంత పారితోషికం తీసుకుందో అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే ఉంటాయని దర్శకుడు ముందుగానే చెప్పటంతో చాలా మంది కథానాయికలు ఈ సినిమాకి నో చెప్పేశారట. ఒకానొక సమయంలో ఈ సినిమాలో నటించటానికి హీరోయిన్ దొరకటం కష్టం అనే భావనకు వచ్చేసారట దర్శక,నిర్మాతలు. ఆ సమయంలోనే పాయల్ రాజ్ పుత్ ప్రస్తావన రావటం ఆమెను అడగటం ఆమె వెంటనే ఒకే చెప్పటం అన్ని చాలా స్పీడ్ గా జరిగిపోయాయట.

సినిమాలో రొమాన్స్ చాలా ఎక్కువగా ఉండటంతో పాయల్ రాజ్ పుత్ బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అందరు భావించారు. అయితే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాకి కేవలం 6 లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుందట. ప్రసుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా పారితోషికం గురించి కాకుండా సినిమా విడుదల అయ్యాక వచ్చే ఆఫర్స్ గురించి ఎక్కువగా ఆలోచించిందట.