Movies

యాంకర్ ఉదయభాను గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఏమి చేస్తుందో తెలుసా?

ఉదయ భాను అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లలను అడిగినా ఆమె గురించి ఠక్కున చెప్పేస్తారు. అంతగా పాపులర్ అయింది. తెలుగు బుల్లితెరపై ఎంతో చలాకీగా వ్యవహరించిన యాంకర్ గా ఉదయభానుకు మంచి పేరుంది. హీరోయిన్స్ ధీటుగా అందం ఒలకబోస్తూ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ,మరోవైపు తన మాటల మంత్రంతో మ్యాజిక్ చేయడంలో ఆమె దిట్ట. నవ్వుతూ, నవ్విస్తూ,ఎంతో ఈజ్ గా యాంకరింగ్ చేయడం ఆమె స్పెషాలిటీ. ఇక సినిమాల్లోనూ ఉదయభానుకు మంచి పేరే వుంది.
అది డాన్స్ రియాల్టీ షో కావచ్చు, సినిమాల ఆడియో ఫంక్షన్ అయినా సరే, యాంకర్ గా ఉదయ భాను స్పెషాలిటీ వేరు. ఇక ఈమె మొదట్లో సినిమా రంగంలోనే అడుగుపెట్టింది.

కానీ అక్కడ ఇమడలేక బుల్లితెరకు చేంజ్ అయింది. ఇక అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ,యాంకరింగ్ కే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. 1980ఆగస్టు 5న ఇప్పటి పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ లో పుట్టింది. తండ్రి ఎస్ కె పాటిల్ వైద్యుడు. తల్లి అరుణ కూడా ఆయుర్వేద డాక్టర్. ఇక ఉదయ భానుకి ఓ సోదరుడు ఉన్నాడు. అయితే మంచి కవి కూడా అయిన ఎస్ కె పాటిల్ పెన్ నేమ్ ఉదయ భాను. పెన్ను పేరునే కూతురికి పెట్టుకున్నాడు.

అయితే ఉదయభానుకు నాలుగేళ్లు వచ్చేటప్పటికి పాటిల్ చనిపోయారు. ఇక ఆమె తల్లి ఆ తర్వాత ఏకంగా ఏడుగురు పిల్లలున్న ఓ ముస్లిం ని పెళ్లాడింది. ఆ విధంగా బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డ ఉదయభానుకు 15వ సంవత్సరం లోనే ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లయినా, ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఇక 10వ తరగతి చదివే సమయంలోనే ఎర్ర సైన్యం మూవీలో ఛాన్స్ రావడంతో హైదరాబాద్ వచ్చిన ఉదయ భాను ఆ తర్వాత ఎలా ఎదిగిందో అందరికీ తెల్సిందే. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్,డాన్స్ బేబీ డాన్స్ ,ఢీ వంటి బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇక కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉండగానే విజయకుమార్ అనే తన మేనేజర్ ని పెళ్లి చేసుకుని సెన్షేషన్ అయింది. ఇక ఈ జంటకు కవల పిల్లలు. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు, యాంకరింగ్ చేసిన ఉదయభాను ఇక ప్రెగ్నెసీ వచ్చాక ఇంటికే పరిమితం అయింది. రెండేళ్ల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను నీతోనే డాన్స్ అనే రియాల్టీ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్ళీ కనిపించని ఆమె ఇంటి పట్టునే ఉంటూ, పిల్లల బాగోగులు చూసుకుంటూ,భర్త వ్యాపారంలో సహకారం అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఇప్పటికీ పాపులారిటీ చెక్కు చెదరలేదు.