Movies

నందమూరి బాలకృష్ణకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే నమ్మలేరు

నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, అన్ని రకాల పాత్రలతో జనాన్ని మెప్పిస్తూ అగ్ర హీరో గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. దాదాపు 3న్నర దశబ్దాలుగా టాలీవుడ్ ని శాసిస్తున్న బాలయ్య సింహ, లెజెండ్, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ లు కొడుతూ,తనలో నటన చేవ తగ్గలేదని చాటుతున్నాడు. ఇక రాజకీయాల్లో కూడా చేరి తన సమకాలీకుల్లో ఓ ప్రత్యేకతను సాధించాడు.అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా 2014ఎన్నికల్లో నెగ్గిన బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే, అప్పట్లో పేర్కొన్న ఆస్తులు ఇలా వున్నాయి. తన ఫామిలీ పేరిట మొత్తం 365కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

వ్యక్తిగతంగా బాలయ్యకు 169కోట్లు, భార్య వసుంధర పేరిట 130కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు. అంతేకాదు కొడుకు మోక్షజ్ఞ పేరిట 22కోట్లు ఆస్తి ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇక ఆయనకు అప్పులు నాలుగు కోట్ల వరకూ ఉన్నాయట.బంగారం విషయానికి వస్తే, బాలయ్య దగ్గర అరకేజీ బంగారం ఉందని బోగట్టా. ఇక 5కిలోల వెండి ఉందట. ఆయన భార్య వసుంధర దగ్గర 3 కిలోల బంగారం,300 కేరెట్ల వజ్రాలు,31కిలోల వెండి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో బాలయ్య పేర్కొన్నారు.

ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏడెకరాల వ్యవసాయ భూమి,షేర్ లింగంపల్లిలో రెండెకరాల భూమి ఉందట. రాయదుర్గం మండలం పవన్ మక్తాలో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ఉందట. మాదాపూర్ లో 940చదరపు అడుగుల ఫ్లాట్స్ ఉన్నాయట. ఇవేకాకుండా రామకృష్ణ స్టూడియోలో వాటా, ఇన్నోటేక్ ప్రయివేట్ లిమిటెడ్ లో 49శాతం వాటా,హెరిటేజ్ ఫుడ్స్ లో ఆరువేలు పైగా షేర్స్ ఉన్నాయట. ఇక రిలయన్స్ లో కూడా షేర్స్ ఉన్నాయి. ఈలెక్కన బాలయ్య ఆస్తి చాలానే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.