Movies

మెగాస్టార్ చిరు సంపాదించిన ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు….నమ్మలేని నిజాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో గర్వంగా చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా నిలుస్తారు చాలామందికి. ఎందుకంటే స్వయం కృష్టి ఎదిగిన ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎందరో హీరోలుగా, దర్శకులుగా, టెక్నీషియన్లుగా పరిశ్రమకు వచ్చి రాణిస్తున్నారు. అందుకే చిరంజీవి కి ముందు, చిరంజీవికి తర్వాత అనే విధంగా సినీ పరిశ్రమను వర్గీకరించి చెప్పి తీరాలి. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ చిరంజీవి నటన,ఫైట్స్,డాన్సులు,
హాస్యం,వ్యక్తిత్వం ఇలా పలు కోణాల్లో నటించి మెప్పించిన చిరంజీవి కి చిరుయే సాటి. ఇక రాజకీయ జీవితం అయితే చంద్రునికో మచ్చలాంటిదని చెప్పాలి.ఎన్నో ఆశయాలతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, రాజకీయాల్లో ఇమడలేక సతమతమయిన చిరంజీవి చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు.

మొత్తానికి తనను ఇంతవాడిని చేసిన సినీ గూటికి చేరారు. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక పర్సనల్ విషయానికి వస్తే, చిరు చాలా ఆస్తిపరుడని అంటారు. అయితే ప్రతిపైసా ఆయన కష్టార్జితం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తాతతండ్రులెవరూ ఇండస్ట్రీలో సంపాదించిందేమీ లేదు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, స్వయం కృషితో ఎదిగి, కోట్లాది అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్న చిరంజీవి కి ప్రస్తుత రెమ్యునరేషన్ చూస్తే,15నుంచి 20కోట్లవరకూ ఉంటుంది.

ఇక చిరంజీవి చేసిన చిత్రాలు 150వరకూ ఉన్నాయి. అందుచేత ఆయన ఆస్తులు వందల కోట్లు దాటేసి వుంటాయని కూడా ప్రతిఒక్కరూ భావిస్తారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసి సమయంలో తన పేరిట 33కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారు. అందులో 30కోట్లు స్థిరాస్తులు కాగా, 3కోట్లు చరాస్తులు గా పేర్కొన్నారు. ఇక అప్పుల విలువ 59లక్షలుగా పేర్కొన్నారు. అలాగే ఆయన భార్యకు 6కోట్ల ఆస్తి ఉన్నట్లు చూపించారు. ఓ ఓల్డ్ సియట్ కారు, మరో ఫియట్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు.

కానీ చిరు వేలకోట్లకు పడగెలెత్తాడని మరో వార్త ప్రచారంలో ఉంది. ఒకప్పుడు సంపాదన వెయ్యి కోట్ల రూపాయలే ఉన్నా, మా టివి ఆస్తులు స్టార్ మాకు విక్రయించాక, చిరు వాటాగా మూడువేల కోట్లు వచ్చినట్లు తెలుస్తోందని, అందుకే ఆయన నాలుగు వేలకోట్లకు చేరిందని సినీ వర్గాలే అంటున్నాయి. ఇక టాలీవుడ్ లో చిరుని ఆస్తుల పరంగా అధిగమించాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నారు కాగా తన డబ్బుని కొణిదల ప్రొడక్షన్స్ లో పెట్టుబడిగా పెడుతున్నట్లు బోగట్టా.