Politics

జగన్ కి ఎన్ని కోట్ల విలువైన ఆస్తి ఉందో తెలుసా?

సెలబ్రిటీలు , రాజకీయ నాయకుల వ్యవహారాలు అన్నీ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక నాయకులపై వచ్చే ఆరోపణలు కూడా చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి వైస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంపైనే. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్,కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి,సొంతంగా తండ్రి పేరు కల్సి వచ్చేలా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల శాతంతో అధికారానికి దూరం అయ్యాడు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన తన పార్టీని ఈసారి ఎలాగైనా సరే అధికారం సాధించాలని కృత నిశ్చయంతో జగన్, కృషి చేస్తున్నాడు.

ఇప్పటికే రాష్ట్రమంతటా పాదయాత్రలో బిజీ గా ఉన్న జగన్ కి వచ్చే ఎన్నికల్లో స్వల్పంగా ఆధిక్యం వస్తుందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో అసలు జగన్ ఆస్తుల వివరాలు ఏమిటని పరిశీలిస్తే,ఆయన పేరిట 279కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయలో భూమి,హైదరాబాద్ సాగర్ సొసైటీలో గల భూమి,బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ టులోని స్థలంతో పాటు,ఏపీలో చాలా ప్రాంతాల్లో ఆయన పేరిట భూములున్నాయి.

ఇక ఓ సందర్భంలో జగన్ 11కోట్ల మేరకు ఇన్కమ్ టాక్స్ చెల్లించినట్లు చెబుతుంటారు. ఇక ఇతర కంపెనీల్లో జగన్ వాటాల విలువ వందల కోట్లలో ఉంటాయని బోగట్టా. అన్ లిస్టెడ్ కంపెనీల్లో జగన్ షేర్స్ విలువ సుమారు 250కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే అధికార టిడిపి నేతలు మాత్రం జగన్ ఆస్త్లులు ఇంకా ఎక్కువే ఉంటాయని ఆరోపణలు చేయడం తెల్సిందే.

ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయని టిడిపి ఆరోపణ. అయితే వైస్సార్ సీఎం గా ఉన్నసమయంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి పేపర్ – ఛానల్ తో పాటు పలు ఎనర్జీ ప్రోసెసింగ్ కంపెనీలను జగన్ నిర్వహించారని అంటారు. ఇక వాటిల్లో కొన్ని సంస్థల వ్యవహారాలను జగన్ భార్య భారతి పర్యవేక్షిస్తున్నారు. కాగా జగన్ పై గల ఆరోపణల నేపథ్యంలో 750కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. నిజానికి వాటి మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.