Politics

చంద్రబాబు ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు

ఎపి సీఎం చంద్రబాబు భారత రాజకీయాల్లో కీలక నేత అని చెప్పవచ్చు. గతంలో 9ఏళ్ళు సీఎం గా పనిచేసిన ఈయన రాష్ట్ర విభజన తర్వాత అనుభవం గల చంద్రబాబుకే ప్రజలు పట్టం కట్టడంతో 2014లో మరోసారి ఎపి కి సీఎం అయ్యారు. ఇక ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడమే కాకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆస్తులు ప్రకటిస్తూ పారదర్శకంగా వుంటున్నారని చెప్పవచ్చు.నిజానికి విద్యార్థి విభాగం నేతగా ప్రస్థానం మొదలు పెట్టి, ఎమ్మెల్యేగా , మంత్రిగా, సీఎం గా ఇలా అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు కొద్దిగా వ్యవసాయ భూములు మాత్రమే ఉండేవి. అయితే పాలిటిక్స్ లోకి వచ్చాక తనకంటూ ప్రత్యేకత సాధించి, సొంత వ్యాపారాలతో ఆర్ధికంగా పుంజుకున్నారు.

మొదటి నుంచీ ఆయనకు హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం మాత్రమే. ఇప్పుడు ఆ వ్యాపార వ్యవహారాలన్నీ ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చూస్తున్నారు. మహిళలే అయినా ఎంతో చాకచక్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ లాభాల బాటలో నడిపిస్తున్నారు. ఇక చంద్రబాబుకి వ్యక్తిగతంగా నాలుగు కోట్లే ఉన్నా,ఆయన హెరిటేజ్ ఫుడ్స్ టర్నోవర్ 2600 కోట్లుగా తేలిందని అంటారు. ఇక ఆయనకు మూడు కోట్లే అప్పులున్నాయి.

ఇక ఇటీవల హైదరాబాద్ లో నాలుగు కోట్ల వ్యయంతో కళ్ళు చెదిరే భవంతిని నిర్మించిన సంగతి తెల్సిందే. కొడుకు నారా లోకేష్ కి 300కోట్లు, భార్య భువనేశ్వరికి 25కోట్ల ఆస్తులున్నాయి. ఇక నిన్నగాక మొన్న పుట్టిన చంద్రబాబు మనవడు, లోకేష్ కొడుకు అయిన దేవాన్ష్ పేరిట అప్పుడే11కోట్ల ఆస్తులుండడం నిజంగా విశేషమే. ఇక కోడలు బ్రాహ్మణి పేరుమీద 15కోట్లు ఆస్తి ఉన్నట్టు కూడా ప్రకటించారు.