Movies

హన్సిక ఏమి చేస్తుంది….ఆమె జీవితంలో నమ్మలేని నిజాలు

నిగ నిగ లాడే ఆపిల్ పండులా దేశముదురు మూవీతో కుర్రకారు హృదయాలను జయించిన హన్సిక తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీతోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ఫ్రెష్ బ్యూటీ ,తన లేలేత అందాలతో అలరించింది. ఆతర్వాత కంత్రి,మస్కా వంటి సినిమాలతో కొద్దికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరిపోయింది. రామ్ హీరోగా వచ్చిన కందిరీగ మూవీతో ఈ ఉత్తరాది భామ పాపులారిటీ హై రేంజ్ కి చేరింది. ప్రస్తుతం తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె కోలీవుడ్ లో హైలెవెల్ రెమ్యునరేషన్ తీసుకునే తారల్లో ఒకరు.ఇక హన్సిక పర్సనల్ విషయాలను టచ్ చేస్తే,1991ఆగస్టు 9న ప్రదీప్ మోత్వానీ, మోనా మోత్వానీ దంపతులకు ముంబయిలో జన్మించింది.

తండ్రి బిజినెస్ మ్యాన్. తల్లి మోనా చర్మ సంబంధ వ్యాధుల వైద్యురాలు. హన్సికకు ప్రశాంత్ అనే సోదరుడు వున్నాడు. బాల్యంలో పొద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలీవుడ్ చిత్రాల్లో, టివి సీరియల్స్ లో బాలనటిగా నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దేవ్ ఫామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అప్పట్లో ఒకే అపార్ట్ మెంట్ లో ఉండేవారు.

ఇక ఇంటర్ లో ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లలేని విధంగా తెలుగు, తమిళ భాషల్లో గుక్కతిప్పుకోలేని అవకాశాలు వచ్చిపడ్డాయి.తెలుగులో మొదటి సినిమా దేశముదురు,తమిళంలో మొదటి మూవీ మా పిళ్ళై చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో గోల్డెన్ లెగ్ అనే సెంటిమెంట్ స్థిరపడింది. ఇక తమిళ అభిమానులచేత గుడి కట్టించుకునే స్థాయికి చేరిందంటే బాబ్లీ గాళ్ హన్సిక రేంజ్ ని ఎలా వర్ణించాలి. కుష్బూ తర్వాత తమిళులు గుడికట్టి ఆరాధించేది ఈమెనే.

గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన గౌతమ్ నందన్ మూవీలో నటించిన ఈమె తమిళంలో ఏకకాలంలో రెండుమూడు సినిమాలు చేస్తూ, నెంబర్ వన్ రేస్ లో ముందంజకు చేరింది. ఇక తమిళ హీరో శింబుతో హన్సిక ప్రేమాయణం సాగిస్తోందని కోలీవుడ్ కోడై కూసింది. మరి అంతకుముందు తెలుగులో బిజీ గా ఉండగా ఒక్క రూమర్ కూడా వినిపించని ఈమె తమిళంలో అలా అడుగిడిందో లేదు త్వరలో శింబుతో పెళ్లి అనే పుకార్లు షికారు చేసేశాయి.

ఇంకా ఆమెలో ఉన్న సుగుణం ఏమిటంటే,సామాజిక స్పృహ మెండుగా గల హన్సిక ప్రస్తుతం 25మంది పేదపిల్లలను సొంత ఖర్చులతో చదివిస్తోంది. ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ కి గురైన 10మంది మహిళకు లక్షలు ఖర్చుచేసి వైద్యం కూడా చేయిస్తున్న హన్సిక ఎందరికో ఆదర్శం అని చెప్పవచ్చు.