Movies

రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు… ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్

కొన్ని వస్తువుల రేట్లు వింటే, వావ్ అంటాం. ఆ వస్తువు వాళ్ళ రేంజ్ ని తెలియజేస్తుంది. అంతెందుకు అత్తారింటికి దారేది సినిమాలో ‘వాడి వాచ్ ఒకటి చాలు నీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి’అని హీరో ఎంత రిచ్చో చెప్పడం గుర్తుందా? అంటే వాచ్ రేటు ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో లక్ష కోట్లకు అధిపతి అయిన పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ ఎంత ఖరీదైనదో చెప్పేందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ డైలాగ్ రాసారు. దాదాపు కోటి రూపాయల విలువైన వాచ్ పెట్టుకోడానికి లక్ష కోట్లే ఉండక్కర్లేదు రామ్ చరణ్ చాలు అన్నట్లుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.ఈ మధ్య ప్రముఖ పారిశ్రామిక వేత్త జివికె మనవరాలు శ్రేయ భోపాల్ పెళ్లి జరిగింది కదా,ఈ పెళ్ళికి భార్య ఉపాసనతో కల్సి రామ్ చరణ్ వచ్చారు.

అందరిలానే రెడీ అయివచ్చినా, రామ్ మాత్రం అందరి నోట్లో నానారు. దీనికి కారణం ఆయన పుట్టుకొచ్చిన వాచ్ అలాంటిది మరి. ఇండస్ట్రీలో ఖరీదైన వాచ్ లు ధరించేవాళ్ళు చాలామంది వున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి. అందుకే మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ వాచ్ లు కొనేస్తూ తన కలెక్షన్స్ పెంచేసుకుంటున్నారు.

అయితే ఖరీదైన వాచ్ లలో చెర్రీ మిగిలిన హీరోలకు ల్యాండ్ మార్క్ ని సెట్ చేసాడని చెప్పవచ్చు ఇక జివికె మనవరాలి పెళ్ళికి రామ్ చరణ్ పెట్టుకొచ్చిన వాచ్ ఖరీదు అక్షరాలా 80 లక్షలుంటుందని టాక్ నడుస్తోంది. ఇక డాలర్ల రూపంలో చెప్పాలంటే ఒక లక్షా 15వేల డాలర్లన్నమాట. పాఠక్ పిలిప్పీ బ్రాండ్ అయిన ఈ వాచ్ ,ఖరీదు అంత.

ఇప్పటిదాకా పది,ఇరవై,లక్షలు వెచ్చించి హీరోలు వాచ్ లు కొంటే. చెర్రీ ఏకంగా 80లక్షల విలువైన వాచ్ పెట్టుకోవడం రామ్ చరణ్ కే సాధ్యమైందని చెప్పవచ్చు .ఎంతలేదన్నా మెగాస్టార్ కొడుకు కదా ఆ మాత్రం వుండాల్లే మరి అంటూ హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారం.