Movies

బిగ్ బాస్ లో ఈ ఐదుగురే సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో తెలుసా?

స్టార్ మా లో బిగ్ బాస్ గేమ్ రంజుగా సాగుతోంది. కొందరు పరిపూర్ణంగా ఆడకుండా, గోడమీద పిల్లిలా ఆడుతుంటే, మరి కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆట అంటే తాడో పేడో తేల్చేయాలేగాని,ఆడి ఆడనట్లు,కేవలం హౌస్ లో ఉంటె చాలు అన్నట్లుగా ఆడడం నిజమైన ఆటగాడి లక్షణం కానేకాదు. అయితే కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళెవరంటే,అందులో మొదటి వరసలో గణేష్ ఉంటాడు. ఈ గణేష్ అయ్ బాబోయ్ నాకేం తెలీదండి,నేను వెళ్ళిపోతానండి, నేను అమాయకుడి నండీ అంటూ గత ఐదువారాలుగా సేఫ్ గేమ్ తోనే సరిపెట్టేస్తున్నాడు.ఈ విధంగా గణేష్ హౌస్ లో వాళ్ళనుంచి, ఆడియన్స్ నుంచి కూడా సానుభూతి సంపాదించాడు. అయితే అమిత్, తో జరిగిన కోడిగుడ్డు టాస్క్ లో మనోడి బండారం బయటపడింది. మళ్ళీ ఇలా సేఫ్ ఆడినా ఆడతాడు మరి.

ఇక మరోవ్యక్తి ఎవరంటే,నందిని. ఈమె తొలి వారం లో కాస్త హల్ చల్ చేసినా, ఆ తర్వాత నుంచి పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేస్తోంది. ఏడ్పులు కూడా అయ్యాయి. భానుశ్రీ అంటే తనకు నచ్చదని ఇతరుల దగ్గర చెప్పుకొచ్చింది. అయితే వాళ్ళు విషయం భానుకి చెప్పేయడంతో అమ్మడికి మైండ్ బ్లాక్ అయింది.అయ్యబాబోయ్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరినీ నమ్మకూడదని నందిని డిసైడ్ అయింది.

ఇక అప్పటినుంచి సేఫ్ గేమ్ ఎలాగంటే,నాని వ్యాఖ్యానించినట్టు ఫర్నిచర్స్ లోనూ, పరుపుల్లోనూ,బెడ్ షీట్స్ లోనూ కలిసిపోయి అసలు ఈమె ఉందా అన్నట్లు ఆడేసింది. అయితే సినిమా టాస్క్ సంపాదించి,కాస్త ఉన్నట్లుగా బిల్డ్ అప్ ఇచ్చింది. టాస్క్ లేనప్పుడు ఈమె ఏమి మాట్లాడుతోందో,ఏమి చేస్తోందో జనాలకు అసలు అర్ధం కావడం లేదు. మరి ఇదంతా చూస్తే, సేఫ్ గేమ్ కాదా మరి.

ఇక మూడో వ్యక్తి విషయానికి వస్తే,అమిత్. ఇప్పటివరకూ అయితే కన్నింగ్ ఫెలోగా అనిపించకపోయినా,సాధ్యమైన మేరకు కామెడీ చేస్తూ ఎదో అలా నెట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరితోనూ స్పష్టంగా మాట్లాడడు,గట్టిగా మాట్లాడడు,తన మనసులో ఏముందో చెప్పడు. ఆమ్మో నన్ను బయటకు పంపేస్తారేమో అన్నట్లు అనిపిస్తోంది తప్ప,వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా ఏదైనా జరిగినపుడు అభిప్రాయం స్పష్టంగా చెప్పకుండా,పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.

నాలుగో వ్యక్తి బాబు గోగినేని. ఈయన మొదటి రెండువారాలు తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పినా, ఆ తర్వాత సేఫ్ గేమ్ ఆడితేనే హౌస్ లో ఉంటామని అర్ధమైనట్టుంది. ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళది కరెక్ట్ అన్నట్లు మాట్లాడుతూ ఎవరిదైనా తప్పనిపిస్తే, ఆ సమాధానాన్ని దాటవేస్తూ,గోడమీద పిల్లిలా మెల్లిగా నెట్టుకొస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇతర కార్యక్రమాల్లో టివి లైవ్ షోల్లో మాట్లాడేటపుడు ఖరాఖండీగా మాట్లాడే బాబు గారు,అంత ఖరా ఖండీగా హౌస్ లో మాట్లాడ్డం గత మూడు వారాలుగా మానేశారు. ఇదే విషయాన్నీ ఇతర సభ్యులు కూడా అనుకుంటున్నారు

ఇక ఐదవ వ్యక్తి ఎవరని చూస్తే,దీప్తి నల్లమోతు. ఈమె మొదటి రెండు వారాలు,బిర్యానీ గణేష్ ని ఓదార్చడంతోనే సరిపెట్టిసి,ఆ తరువాత కూడా పూర్తి సేఫ్ గేమ్ ఆడేస్తోంది. శ్యామల తో మాత్రమే ఎక్కువ మాట్లాడుతూ,ఇతరులతో ఎక్కువ కలవకుండా,ఇద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించారు. అందుకే శ్యామలను బయటకు పంపేసారు. ఇక ఆ వారం కొన్ని ఎక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కాలేదు. అయితే తాను ఏమని అనుకుంటోంది,తన అభిప్రాయం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా ఇలాగే సేఫ్ గేమ్ ఆడితే మాత్రం దీప్తి నల్లమోతు ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో ఉండదనే చెప్పాలి. ఫైనల్ దాకా వెళ్లాలంటే మాత్రం సేఫ్ గేమ్ ని పక్కకు పెట్టక తప్పదు ఎవరికైనా.