దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి ఎంత డిమాండ్ చేసిందో తెలుసా?
బుల్లితెర సెన్షనల్ రియాల్టీ షో బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పార్టిసిపెంట్ చేసే కంటెస్టెంట్ లలో దీప్తి సునైనా తన వంతుగా వినోదం పండిస్తోంది. ముఖ్యంగా తనీష్ తో ఆమె సాగిస్తున్న యవ్వారం ఆడియన్స్ లో మరో లోకంలో విహరించేలా చేస్తోంది. యూట్యూబ్ క్వీన్ గా పేరొందిన దీప్తిని చూడగానే టీనేజ్ భామలా ఉంటుంది. ముద్దు ముద్దుగా మాట్లాడే ఈ బాబ్లీ గాళ్,బిగ్ బాస్ సీజన్ కి రాకమునుపే లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.థట్స్ మై వీడియోలు,షార్ట్ ఫిలిమ్స్ తో ఎంతోపేరు తెచ్చుకున్న ,దీప్తికి గల పేమ్ కారణంగానే బిగ్ బాస్ సీజన్ టుకి సెలెక్ట్ అయింది. ఇక్కడ విషయం ఏమంటే, ఈ షోకి సెలక్ట్ అయినవాళ్లకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది.
సింగర్ గీతామాధురి హౌస్ లో అందరికన్నా ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు టాక్. దీంతో దీప్తి సునైనా కు ఎంత ఎమౌంట్ ఇస్తున్నారన్న దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన మోడల్ భామ సంజన చెప్పిన దాని ప్రకారం దీప్తికి బానే అందుతోందట.
బిగ్ బాస్ హౌస్ లో దీప్తి , తాను ఒకే బెడ్ పై పడుకునే వాళ్లమని,అప్పుడే మాటల్లో ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి చెప్పిందని వివరించింది.వారానికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు దీప్తి సునైనా తనతో చెప్పిందని సంజన పేర్కొంది. ముందుగానే కొంత మొత్తాన్ని ముట్టచెప్పడంతో దాంతో బ్రాండెడ్ దుస్తులు, మేకప్ కిట్స్ కొనుక్కుందని సంజన చెప్పుకొచ్చింది.
కాగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన తమకు మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని సంజన చెబుతూ, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, గుర్తింపు కోసం వెళ్లానని, ఇక మేకప్ కిట్స్ లాంటివి సొంత డబ్బులతో కొనుక్కున్ననాని వివరించింది. హౌస్ లోకి వెళ్ళాకే ఎవరికీ ఎంతెంత ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వడం లేదో తెల్సింది చెప్పింది.