ప్రభాస్ మేకప్ మెన్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
వెండితెరపై నటీనటులు తళుక్కున మెరవాలంటే, వారు వేసుకున్న మేకప్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. తెరమీద తమ అభిమాన నటీనటులు అందంగా, ఆకర్షణగా కనిపించాలని అభిమానులు కూడా కోరుకుంటారు. మరి మేకప్ మ్యాన్ కి మన స్టార్ హీరోలు ఎంత జీతం ముట్టజెబుతారో ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మేకప్ మ్యాన్స్ కి , టచ్ అప్ బాయ్స్ కి సొమ్ము బానే అందుతోందని అంటున్నారు.సినిమా బడ్జెట్,రోల్,వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, మ్యాకప్ అవసరాన్ని బట్టి లోకల్ మ్యాకప్ మ్యాన్ కావాలా,ముంబయ్ నుంచి స్పెషల్ ట్రైన్డ్ మ్యాకప్ మ్యాన్ లను బరిలో దింపాలా అనే విషయాలను షూటింగ్ వెళ్లేముందు ఖరారు చేస్తారు.
ఇక మన స్టార్ హీరోల విషయానికి వస్తే,వందకోట్ల క్లబ్ రేంజ్ కనుక అందుకు తగ్గట్టే మ్యాకప్ మ్యాన్ కి చెల్లింపులు చేస్తున్నారని తెలుస్తోంది. స్టార్ మ్యాన్ మేకప్ కి లోకల్ గయ్ ఐతే 5వేలు వరకూ ఉంటుందట. ఇక ముంబై కుంచి రప్పిస్తే,రోజు కాల్ షీట్ కి 6వేలనుంచి 8వేల రూపాయల మధ్య వుంటుందట.
అంతే కాదండోయ్ ముంబై నుంచి వచ్చినందుకు, సౌకర్యాలు, విమాన ఖర్చు అదనం. ఇక చెమట తుడిచే టచ్ అప్ బాయ్ కి కాల్ షీట్ కి మూడువేల వరకూ ముడుతుందట. స్టార్ హీరో ప్రభాస్ భారీ క్రేజీ చిత్రాల్లో నటించడం వలన లొకేషన్ లో పర్మినెంట్ గా ముంబై మేకప్ మ్యాన్ లను ఉపయోగిస్తున్నారట.
ఇక విదేశీ షూటింగ్స్ కైతే టాప్ మోస్ట్ మేకప్ మ్యాన్ లను రంగంలో దించుతున్నారట. రామ్ చరణ్, ఎన్టీఆర్,బన్నీ వంటి స్టార్ హీరోలకు కూడా అవసరాన్ని బట్టి ముంబై మేకప్ మ్యాన్స్ ని ఉపయోగిస్తున్నారట. ఈవిధంగా బాలీవుడ్ కి ధీటుగా మేకప్ మ్యాన్ ల విషయంలోనూ మన స్టార్ హీరోలు పోటీగా నిలుస్తున్నారు.