Politics

KTR కి షాక్ ఇచ్చిన అర్జున రెడ్డి హీరో విజయ్ దేవరకొండ

తెలుగు చిత్రసీమలో వస్తున్న వర్ధమాన హీరోలలో తమ సినిమాలతోనే కాదు మాటలతో కూడా ఆకట్టుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అందులో ప్రధానంగా విజయ్ దేవరకొండ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్ అర్జున్ రెడ్డిలో ఎంతగా హీరోయిజం పండించాడో,ఇక మాటల తూటాలతో చురుక్కు మనిపించేలా మాట్లాడడంలో విజయ్ స్టైల్ వేరని చెప్పాలి. ప్రతి మాటకు ఓ రీజన్ గల ఈ హీరోకి అంత కన్నా మంచి మనసు కూడా వుంది.అందుకే చేసింది కొన్ని సినిమాలే అయినా అందరికీ కావలసిన వాడయ్యాడు విజయ్. అంతెందుకు టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోను కదిలించినా, విజయ్ దేవరకొండ గురించి ఫేవర్ గానే చెబుతారు. స్టార్ హీరోలు, సైడ్ హీరోలని తేడా లేకుండా అందరితో సింపుల్ గా వుండే విజయ్ అందుకే అందరికీ దగ్గరయ్యాడని చెప్పవచ్చు.

ఇక ఎన్ని మూవీసీ చేసినా దక్కని క్రేజ్ ని అర్జున్ రెడ్డితోనే దక్కించుకున్నాడు. స్టార్ డమ్ ని అందిపుచ్చుకున్న ఈ హీరో మహానటిలో పోషించిన పాత్రతో ఆడియన్స్ కి మరీ దగ్గరయ్యాడు. ఇక తనకు వచ్చిన ఫిలిం ఫెర్ అవార్డుని వేలం వేసి నిధులు సేకరించి సీఎం సహాయ నిధికి ఇస్తానని ప్రకటించిన విజయ్,తన పెద్దమనసు చాటుకున్నాడు.

ఫీల్డ్ లోకి వచ్చిందే కొత్త, ఓ అవార్డు వస్తే అపురూపంగా దాచుకోవడం మానేసి అమ్మేసుకుంటాడా అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అవార్డు తన దగ్గర ఉంటే, తనకే సంతోషం ఉంటుందని,అయితే దానిద్వారా వచ్చే సొమ్ము ఎందరికో ఉపయోగపడుతుందని చెప్పడం ద్వారా తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

కాగా అన్నమాట ప్రకారం అవార్డు ని అమ్మేసి వచ్చిన 25 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధి కోసం మంత్రి కేటీఆర్ కి తల్లి తండ్రి, సోదరులతో కల్సి వచ్చి అందజేసి తన మాటను విజయ్ నిలబెట్టుకుని, మురిసిపోయాడు. విజయ్ సహృదయతను మంత్రి కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.

మీ లాంటి యువకులు రాష్ట్రానికి ఇలా సాయం అందిస్తే ఎందరో అభాగ్యులకు ప్రభుత్వం సహాయం చేయడానికి వీలుగా వుంటుందని కేటీఆర్ కొనియాడారు. మంచి కొడుకుని కన్నారంటూ తల్లిదండ్రులను అభినందించి,బుద్ధుని ప్రతిమను అందజేసి వారిని కేటీఆర్ ఘనంగా సన్మానించారు.