Politics

ఎన్టీఆర్ బయోపిక్ పై జగన్ షాకింగ్ కామెంట్స్ …. షాక్ లో చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం లోకి రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వైస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర పేరిట జనంలో దూసుకు పోతున్నారు. పాదయాత్రలకు పల్లె,పట్టణం అనే తేడా లేకుండా అన్నిచోట్లా జనం నీరాజనం పడుతున్నారు.ఈ అనూహ్య స్పందన చూసి కార్యకర్తలు, పార్టీ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఇది ఒరవడి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి కష్ఠాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక జగన్ వ్యవహార శైలిలో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.

అంతే కాదు జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న జగన్, ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా గురించి తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక ప్రత్యేక హోదా పై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.ఓ పక్క బిజెపితో మడమ తిప్పని పోరాటం అంటారు. మరోపక్క ఎన్టీఆర్ బయోపిక్ మూవీ షూటింగ్ లో వెంకయ్య నాయుడు కనిపిస్తారు.

నిజానికి ఈసినిమా తీసేది, తెలుగుదేశం అధిపతి చంద్రబాబుకి బావమరిది. బాబు గారేమో బిజెపితో యుద్ధం అంటుంటే , ఇలా తెర వెనుక మాత్రం టిడిపి నేతల కార్యక్రమాలకు బిజెపి నేతలు వస్తూంటారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నిజంగా యుద్ధం చేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా అనిపిస్తోంది. ప్రజల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. ఇక పరకాల ప్రభాకర్ టిడిపి ప్రభుత్వంలో పదవి అనుభవిస్తుంటే, ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రంలో మంత్రిగా వుంటారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశపై గట్టిగా మాట్లాడిన కేంద్రమంత్రి భర్త ఇక్కడ టిడిపి ప్రభుత్వంలో పదవిలో వుంటారు. మరోవైపు చంద్రబాబుని బెస్ట్ ఫ్రెండ్ అని రాజనాధ్ సింగ్ అంటారు. ఈ బంధం ఎన్నటికీ వీడనిదని అంటారు. ఇవన్నీ చూస్తుంటే, లోలోపల ఏదో జరుగుతోందన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఎన్నికల ముందు ఆరు నెలలు విడాకులు,ఎన్నికలయ్యాక 4 ఏళ్ళు సంసారం ఇదే బీజేపీతో చంద్రబాబు నైజం’అని జగన్ మండిపడ్డారు.
Chandra Babu Nayudu
చంద్రబాబు పోరాటంలో నిజాయితీ లేదని,ఆయనలో చిత్తశుద్ధి లోపించిందని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మహారాష్ట్రలో అధికారంలో బిజెపి ఉంది. అక్కడ ఆర్ధిక మంత్రిగారి భార్యకు టిటిడిలో మెంబర్ గా వేశారు. ఇలాంటివి చాలా వున్నాయి. మరి చంద్రబాబు బిజెపితో ఎక్కడ యుద్ధం చేస్తున్నారో చెప్పాలి అని జగన్ సవాల్ విసిరారు.