Movies

కౌశల్ ఫ్యాన్స్ నుండి తేజస్విని సేవ్ చేయటానికి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

స్టార్ మా లో అందరినీ ఆకర్షించే ప్రోగ్రాం గా మారిన బిగ్ బాస్ సీజన్ టులో ఆసక్తికర ఘట్టాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ‘శనివారం ఎప్పుడు వస్తుందా అని నా చిన్నప్పుడు ఎదురుచూసేవాడిని. సేమ్ ఇప్పుడు కూడా శనివారం ఎప్పుడెప్పుడా , ఎప్పుడు అందరినీ కల్సుకుందామా అని ఎదురుచూస్తున్నాను’అంటూ బిగ్ బాస్ లైవ్ షో ఎపిసోడ్ 42లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాని.ఇక ప్రతివారం ఓ పిట్టకథ చెప్పే నాని,ఈవారం కూడా వెరైటీగా సంక్రాంతి సినిమా కథ చెప్పొకొచ్చి, హౌస్ లో జరుగుతున్న రచ్చను చూపించాడు. ఈ వారం ఎలిమినేషన్ లో గల రోల్ రైడా, తేజస్వి, తనీష్,సామ్రాట్ ,దీప్తిలు నామినేషన్ డిస్కషన్ కోసం స్టాటజీని నడిపించారు. అసలు తాము హౌస్ లోకి ఎందుకు ఎలా వచ్చామో, ఎలిమినేట్ అయితే ఎలా ఫీలవుతామో వంటి విషయాలను మిగిలిన మెంబర్స్ తో షేర్ చేసుకున్నారు.

‘నేను డబ్బు కోసమే వచ్చా. వంద రోజుల్లో ఎన్ని సినిమాలు చేసినా,ఈవెంట్స్ కి వెళ్లినా 50లక్షలు సంపాదించలేను. ఇక హౌస్ లో అందరికీ బాగా కనెక్ట్ అయ్యాను. అలాగే తనీష్, సామ్రాట్ లతో కనెక్ట్ అయ్యాను. నన్ను నేను తనీష్ లో చూసుకుంటాను. అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే తనీష్ అనే భావన’అని తేజస్వి చెప్పుకొచ్చింది.

నా గత జీవితం మరిచిపోయి నన్ను నేను నిరూపించుకోవడం కోసమే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను. నిజానికి నా మీద చాలా రూమర్స్ ఉన్నాయి. నా గురించి సందేహాలున్నాయి. నా తండ్రి ఆరోగ్యం కొంచెం బాగోలేన్నప్పటికీ ముందు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నా ఆరోగ్యం పర్వాలేదంటూ నా తండ్రి ధైర్యం చెప్పి ఇక్కడకు పంపించారు’అని సామ్రాట్ వివరించాడు.

ఇన్నాళ్లూ బిగ్ బాస్ హౌస్ లో నా జర్నీ బానే వుంది. ఇప్పుడు ఎలిమినేట్ అయినా సంతోషంగా బయటకు వచ్చేస్తా’అని దీప్తి నల్లమోతు చెప్పగా, ‘బిగ్ బాస్ ద్వారా తెలుగులో ఓ ర్యాంప్ సింగర్ ఒకరు ఉన్నాడు అని అందరికీ తెలియజేయడానికి ఈ హౌస్ కి వచ్చాను. ముఖ్యంగా పిల్లల్లో కూడా తాము ఓ ర్యాంప్ కావాలని కోరుకోవాలి”అని ఎమోషనల్ గా రోల్ రైడా చెప్పాడు.

‘నిజానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన రోజుల్లో ఎవరున్నా లేకున్నా నేనుంటే చాలు అనుకున్నా. కానీ ఆ తర్వాత నా వాళ్ళు ఉంటె చాలు అనుకుంటున్నాను. ఎవరు ఎలిమినేట్ అవుతున్నా బాధగా వుంది. అందరూ ఇక్కడే ఉండిపోవాలని వుంది. ఇక హౌస్ లో సింగర్ గీతా మాధురికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నాను’అని తనీష్ చెప్పాడు. ఇక నందిని తో మాట్లాడితే చాలు నాకు చాలా హాయిగా ఉంటుంది. ఆమె నవ్వితే ఇంకా బాగుంటుంది. నాకు పెళ్ళై కూతురు పుడితే నందిని అంతటి క్యూట్ గా ఉండాలని కోరుకుంటా’అంటూ నందినికి బిస్కట్ వేసాడు తనీష్.

ఇక దీప్తి సునైనా,తనీష్ తో అంటిపెట్టుకుని ఉండడాన్ని గమనించి మరోసారి నాని నవ్వుకుతూనే చురకలు అంటించాడు. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఒక్కరోజైనా ఇండివిడ్యువల్ గా ఉన్నావా అంటూ నాని అడిగేసరికి, ‘నేను తనీష్ కి దూరంగా ఉంటున్నా, కానీ అతడు నాకు బాగా అలవాటు అయిపోయాడు’ అని దీప్తి సిగ్గుపడిపోయింది. ఒకవేళ తనీష్ వెళ్ళిపోతే ఎవరితో ఉంటావ్ అని నాని అడగ్గా, అప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటా అని సునైనా బదులిచ్చింది.

ఇక కౌశల్, నందిని ల మధ్య గల గొడవ గురించి కూడా రాబట్టే యత్నం చేసాడు హీరో. ఇక ఎక్కువ భాగం హౌస్ లో సినిమాపైనే నడిచింది. ఈ సినిమా బానే ఉందని,నేను కూడా ఎంటర్ టైన్ చేసానని నాని రివ్యూ ఇచ్చాడు. సకుటుంబ సపరివార మూవీ అంటూ 4.5రేటింగ్ కూడా నాని ఇచ్చేసాడు. ఈవారం ఎలిమినేషన్ లో గల రోల్ రైడా, తేజస్వి, తనీష్,సామ్రాట్ ,దీప్తిలలో రోల్ రైడా, దీప్తి తనీష్,,లు సేఫ్ జోన్ లో ఉన్నట్టు బిగ్ బాస్ నాని ప్రకటించి, వీళ్ళకి రిలీఫ్ ఇచ్చాడు.

ఇక మిగిలిన ఇద్దరూ తేజస్వి, సామ్రాట్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారని నాని ట్విస్ట్ ఇచ్చాడు. రొమాంటిక్ జోడి తేజస్వి, సామ్రాట్ లలో ఆదివారం ఎవరు బయటకు వస్తారో అనే విషయంలో ఓటింగ్ ని బట్టి, సామ్రాట్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది. అయితే ఎవరు ఎలిమినేషన్ అవుతారో వేచి చూడాలి.