Movies

రఘువరన్ భార్య రోహిణి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

తన విలనిజంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రఘువరన్,తెలుగు,తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో విలన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసాడు. పసివాడి ప్రాణం,రుద్రనేత్రం వంటి చిత్రాల్లో విలన్ గా, అంజలి వంటి క్లాసిక్ మూవీలో తండ్రిగా అద్భుత నటన పండించి, తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సినిమాలు అతనిని ఎంతో ఎత్తుకి తీసుకెళ్తే, చెడు వ్యసనాలు మాత్రం పతనం దిశగా తీసుకెళ్లాయి. ఓ దశలో డ్రగ్స్ కి బానిస అయిన రఘువరన్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. ఆయనకు భార్య , ఓ కుమారుడు వున్నారు.బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, అందాల నటిగా ఎదిగిన రోహిణి రఘువరన్ భార్య. హీరోకి చెల్లెలుగా, హీరోయిన్ గా అనేక పాత్రలు వేసి, సౌత్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చేకున్న రోహిణి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.
Rohini.
1977లో యశోద కృష్ణ మూవీతో 5ఏళ్ళ వయస్సులో తెలుగుతెరకు పరిచయం అయిన ఈమె దాదాపు 130 చిత్రాల్లో నటించింది. ఈమె స్వస్థలం అనకాపల్లి. బాల్యంలోనే ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడింది. రోహిణి కి ముగ్గురు అన్నలు, ఓ తమ్ముడు ఉన్నారు. ఇక తెలుగు సినిమాల్లో,టివి సీరియల్స్ లో నటించే సీనియర్ నటుడు బాలాజీ స్వయానా రోహిణి సోదరుడే. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో సినిమా పిచ్చి గల తండ్రి రోహిణి ని వెంటేసుకుని చెన్నై స్టూడియోల్లో తీరుతుండేవాడు.
Rohini And Raghuvaran
అక్కడ కొందరు సినీ ప్రముఖులు రోహిణిని చూసి బాలనటిగా అవకాశం ఇచ్చారు. ఇక హీరోయిన్ గా చేసే సమయంలో విలన్ పాత్రల్లో రాణిస్తున్న రఘువరన్ తో రోహిణి ప్రేమలో పడింది. అప్పటికే డిప్రెషన్ లో ఉన్న అతన్ని డ్రగ్స్ కి పూర్తి దూరంగా ఉంచడంలో రోహిణి సక్సెస్ అయింది. 1996లో ఇద్దరూ పెళ్లి చేసుకున్న వీరికి రిషి వరుణ్ అనే కొడుకున్నాడు.

అయితే కొడుకు పుట్టాక సినీ ఛాన్స్ లు తగ్గిన రఘు మళ్ళీ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. ఇక భార్య భర్తల మధ్య వివాదాలు ముదిరిపాకాన పడడంతో ఇద్దరూ 2004లో విడాకులు తీసేసుకున్నారు. భార్య దూరం కావడంతో రఘు పూర్తిగా అదుపు తప్పాడు. డ్రగ్స్ తో పాటు మద్యం కూడా ఎక్కువ తీసుకోవడంతో లివర్ చెడిపోయింది.

ఇక నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. ఇక కొడుకు కోసం తెలుగులో ‘అలా మొదలైంది’చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిణి,ఇటీవల బాహుబలిలో ప్రభాస్ పెంపుడు తల్లి పాత్రలో రాణించింది.

అంతేకాదు ప్రయివేట్ గా ఎం ఏ ఇంగ్లిష్ చేసిన ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో పాటలు కూడా రాసింది. కొన్ని మూవీస్ కి స్క్రీన్ ప్లే చేసింది. ఆమె కొడుకు రిషి వరుణ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. కొడుకుని నటుడిగా చేయాలన్న తపనతో డాన్స్ , ఫైట్స్ లో శిక్షణ ఇప్పిస్తోంది.