నువ్వే కావాలి సినిమా లో “ఐ ఆమ్ సారీ” అంటూ పడిపోతూ ఉండే వర్ష గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
నువ్వే కావాలి సినిమా లో అస్తమాను పడిపోయి “ఐ ఆమ్ సారీ” అంటూ ఉండే వర్ష గుర్తు ఉందా? ఆమె ఆ తర్వాత చాలా మంది హీరోలకు చెల్లిగా,వదినగా నటించి మెప్పించింది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కి వదిన గా, సుస్వాగతం సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా, వాసు సినిమాలో వెంకటేష్ కి చెల్లెలిగా నటించింది. ఆలా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాల నుండి విరమణ తీసుకుంది. వర్ష అసలు పేరు మాధవి. ఆమె పంజరం సినిమాలో మినా చెల్లెలిగా బాలనటిగా నటించింది.ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాలో వర్ష పాత్ర చేసింది. ఇక అప్పటి నుండి ఆమె పేరు వర్ష గా స్థిరపడిపోయింది. అప్పటినుండి హీరొ, హీరోయిన్ లకు చెల్లిగా,వదినగా,ఫ్రెండ్ గా నటించింది. ఆమె చదువుకొనే రోజుల నుంచే సినిమాలు చేస్తూ రెండింటిని బేలన్స్ చేసేది. అప్పట్లో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిలల్లతో గడుపుతూ సినిమాలు,సీరియల్స్ అన్నింటికీ దూరం అయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావటంతో మరల టీవీ రంగం వైపు అడుగులు వేసి మా టీవిలో సుందరకాండ సీరియల్ పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. ఆమె ఇంకా మంచి మంచి సీరియల్స్ లో నటించాలని కోరుకుందాం.