Movies

చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

మెగాస్టార్ అనగానే మనకు వెంటనే చిరంజీవి గుర్తుకువస్తారు. మెగాస్టార్ కి 30 సంవత్సరాలని అంటున్నారు. ఆశ్చర్యమగా ఉందా?చిరంజీవికి వయస్సు 60 సంవత్సరాలు దాటింది కదా? చిరంజీవి వ్యక్తిగా 60 సంవత్సరాలు దాటాయి. కానీ మెగాస్టార్ గా మాత్రం 30 సంవత్సరాలే. ఎందుకంటే 1988 ఆగస్టు 4 న మరణ మృదంగం సినిమా విడుదల సందర్భంగా నిర్మాత K.S. రామారావు మెగాస్టార్ బిరుదును ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి అని పిలిచారు. అప్పటి వరకు సుప్రీం హీరో,డైనమిక్ హీరో ఇలా రకరకాల బిరుదులతో పిలిచే చిరంజీవిని మరణ మృదంగం సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి అని పిలవటం ప్రారంభించారు. ఆలా మరణ మృదంగం సినిమా విడుదల అయ్యి 30 సంవత్సరాలు దాటాయి.

అంటే చిరంజీవిని మెగాస్టార్ గా కీర్తించటం ప్రారంభించి 30 సంవత్సరాలు దాటాయి. దాంతో మెగా అభిమానులు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది? ఎన్ని సంవత్సరాలు అయిందో అనే వివరాలతో పోస్టర్ ని చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ బిరుదును మొదటిసారిగా మిడియా ముందు ప్రకటించింది రావు గోపాలరావు.

తెలుగు చిత్ర సీమలో మాస్ హీరోగా నాత్ర తర్వాత అంతటి గుర్తింపు పొందాడు మెగా స్టార్ చిరంజీవి. అలాగే జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాడు. రాజకీయాల్లోకి వెళ్లి పది సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీని ఘనంగా చాటాడు చిరు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినీరంతో బిజీగా ఉన్నాడు.