Movies

ఆకాశంలో ఒక తార అని కృష్ణ కి పాడిన రాజ్ సీతారాం ఇప్పుడు ఎంత పెద్ద రేంజ్ లో ఉన్నారో చూడండి

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతూ 250 వ సినిమా వైపుకి అడుగులు వేస్తున్నారు. అయన సంవత్సరానికి 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. కృష్ణకు,గాయకుడు బాల సుబ్రహ్మణ్యంనకు ఒక విషయంలో తేడా వచ్చింది. కృష్ణ నా సినిమాలకు పాడవలసిన అవసరం లేదని అనడంతో బాలు కూడా సరే అన్నారు. కృష్ణ జేసు దాసుతో వరుస సినిమాలకు పాటలు పాడించుకుంటున్నారు. ఇది 1985 నాటి మాట. అప్పుడు కొత్త గాయకుడికి ఒక బంపర్ ఛాన్స్ దొరికింది. అతని పేరు రాజ్ సీతారాం. రాజ్ సీతారాంతో కృష్ణ దాదాపుగా 30 సినిమాలకు పాటలు పాడించుకున్నారు. ఇప్పుడు శంకర్ మహదేవన్,ఉదిత్ నారాయణ్ ఎలా అయితే వైవిధ్యాన్ని చూపేవారో,అప్పట్లో రాజ్ సీతారాం గొంతు కృష్ణకు బాగా సెట్ అయింది.

రాజ్ సీతారాం కృష్ణకు 1985 నుంచి 88 వరకు అంటే మూడు సంవత్సరాలు పాడగా వాటిలో 14 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సూర్య చంద్ర,బ్రహ్మాస్త్రం,సింహాసనం,ఖైదీ రుద్రయ్య,తండ్రి కొడుకుల ఛాలెంజ్,దొంగోడొచ్చాడు,ముద్దాయి వంటి సినిమాలకు పాడాడు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాల్లో అయన పాడటం ఆపేసారు. ఎందుకంటే రాజ్ సీతారాంకి పాటలు పాడటం ఒక హాబీ మాత్రమే.

కృష్ణ సినిమాలకు పాటలు పాడకముందే శోభన్ బాబు సినిమా జగన్ లో ఒక పాట పాడారు. ఆ తర్వాత రాజ్ సీతారాంకి పెద్దగా సపోర్ట్ లేకపోవటం,కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యంతో పాడించటానికి రాయబారాలు సక్సెస్ అవ్వటంతో ఆ తర్వాత కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యం పాడటం వరుసగా జరిగిపోయింది.

1990 పత్రికల్లో బాలుని ఎన్టీఆర్,ANR, శోభన్ బాబు తిరస్కరిస్తే కృష్ణ ఆదరించారని చెప్పుతారు. అయన వారి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పటికి పల్లెలలో రాజ్ సీతారాం పాడిన సింహాసనం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజ్ సీతారాం ఏమి చేస్తున్నారనే సందేహం కలుగుతుందా? ఆ తర్వాత రాజ్ సీతారాం Rural Management లో డిగ్రీ చేసారు.

గుజరాత్ లో శ్రీరామ్ వెంచర్స్ లో కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత కొంతకాలం VIDEOCON లో కూడా పనిచేసారు. ఆ తర్వాత US వెళ్లి సెటిల్ అయ్యారు. రాజ్ సీతారాం US లో పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.