చిరంజీవికి చాక్లెట్ ఇచ్చిన వై.స్.భారతి… ఎందుకో తెలుసా?
తెలుగు రాజకీయాల్లో వై.స్.జగన్ పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. జగన్ పాదయాత్రతో అధికార టీడీపీలో గుబులు రేకెత్తిస్తూ ఉన్నాడు. దాంతో ప్రతిరోజూ ఎదో వార్తతో మీడియాలో ఉంటున్నాడు. అయితే ఇటీవల జగన్ భార్య భారతి పేరు కూడా రావటం కాస్త సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో వార్త వినపడుతుంది. జగన్ భార్య భారతి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఒక పెద్ద చాకోలెట్ ని కానుకగా పంపిందట. ఈ విషయం సినీ,రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. చాలా మంది చిరు ఇంటిలో ఎదో శుభకార్యం జరిగి ఉంటుంది. కాబట్టి మర్యాద పూర్వకంగా కానుక పంపించారని అనుకున్నారు. అయితే అసలు విషయం అది కాదు.
ఈ మధ్య సాక్షి టివిలో ఒక అవార్డు వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ రంగానికి సంబందించి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్,ఉత్తమ నటుడు అవార్డులను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో ఖైదీ నెంబర్ 150 సినిమాకి గాను ఉత్తమ నటుడు అవార్డు ని చిరుకి ప్రకటించారు. ఆ అవార్డు వేడుకకు చిరంజీవి హాజరు కాలేదట.
సైరా సినిమాతో బిజీగా ఉండుట వలన ఈ అవార్డు ఫంక్షన్ కి రాలేకపోతున్నా అని సాక్షి టివికి చిరంజీవి సందేశం పంపారట. చిరంజీవి వంటి వ్యక్తిని వేదికపై సన్మానించ లేకపోవటంతో వై.స్.భారతి చాలా బాధ పడ్డారట. అందుకే చిరంజీవి నివాసానికి బెస్ట్ యాక్టర్ అవార్డు తో పాటు పెద్ద చాకోలెట్ ని పంపారట భారతి.
ఈ అవార్డు ని ఇంటి దగ్గర తీసుకోని చిరంజీవి చాలా ఆనందపడ్డారట. చిరంజీవి నా చెల్లెమ్మ ఇచ్చిన ఈ అవార్డు ని జీవితాంతం దాచుకుంటానని వై.స్.భారతికి సందేశం పంపారు. ఈ విషయం చరంజీవి సన్నిహిత వర్గాల నుండి బయటకు వచ్చింది.