Movies

విజయ్ దేవరకొండ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

విజయ్ దేవరకొండ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసినా పెళ్లిచూపులు సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టార్ అయ్యిపోయాడు. ఇప్పుడు గీత గోవిందం హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ గురించి మీకు తెలియని విషయాలను తెలుసుకుందాం. దేవరకొండ విజయ్ సాయి హైదరాబాద్ లో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవిలు. విజయ్ కి ఒక తమ్ముడున్నాడు ఆనంద్,విజయ్ అనంతపురం జిల్లాలో ఉన్నపుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.టీవీలు, ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాఠశాల ఉండేదనీ, అక్కడే కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నాడట.

అక్కడ చదువుకునేప్పుడు విజయ్ ఎంత అమాయకంగా ఉన్నారో మనంఈ మధ్య ఒక ఫొటోలో కూడా చూశాం. స్కూలు చదువు పూర్తయ్యాకా, హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్. బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.విజయ్ తండ్రి టివి సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తుంటారు. నిజానికి ఆయనకు తన తండ్రే స్ఫూర్తి.

సినిమాల్లో నటించేందుకు మహబూబ్ నగర్ లోని అచ్చంపేట నుంచి హైదరాబాద్ వచ్చారు విజయ్ తండ్రి.తల్లి మాధవి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. విజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలోని డిలాయిట్ లో పని చేస్తున్నారు.సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్ లో పాల్గొన్న విజయ్, హైదరబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు చేశారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు విజయ్.

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రం,శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పాత్రల్లో కనిపించారు విజయ్. ఆ సమయంలోనే సహాయ దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలసి రిషి పాత్రలో నటించారు.

ఈ సినిమాలో విజయ్ నటన చూసిన నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు తమ సంస్థలో రెండు చిత్రాలు చేసేందుకు విజయ్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు.2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతువర్మ సరసన పెళ్ళిచూపులు సినిమాలోనటించారు విజయ్. ఈ సినమా ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది.