Devotional

ఆగష్టు 3 రాఖీ పౌర్ణమి రోజు ఏ సమయంలో రాఖీ కడితే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి

రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. రాఖీ పౌర్ణమి అనేది అక్కాచెల్లెళ్లు,అన్నదమ్ములు కలిసి చేసుకొనే పండుగ. రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంత కాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో మాత్రమే ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. అయితే ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమకు సూచనగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ యొక్క ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు,

అక్కా తమ్ముళ్ళు జరుపుకునే అందమైన ఆత్మీయమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ కట్టేదే రాఖీ. ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. రాఖీ పొర్ణమిని రక్ష బంధన్ అని కూడా అంటారు. రక్షా బంధన్ అనేది హిందీ పేరు. రక్షా అంటే రక్షణ అని,బంధన్ అంటే ముడి అని అర్ధం.

రెండుపదాలను కలిపితే రక్షణను ఇచ్చే ముడి అని అర్ధం. రక్షా బంధన్ కి సంబంధించి ఒక పురాణ గాధ ఉంది.ఒకసారి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. ఎంత కాలం అయినా మహా విష్ణువు రాకపోవటంతో లక్ష్మి దేవి బలి చక్రవర్తి వద్దకు వెళ్లి మణికట్టుకు దారాన్ని కట్టి సోదరుడిగా చేసుకొని విష్ణువుని వైకుంఠానికి పంపమని వాగ్దానం తీసుకుంది మహాలక్ష్మి. అప్పటి నుండి రక్షాబంధానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పండుగను అన్ని మతాల వారు జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుని మణికట్టుకు ఒక దారాన్ని కట్టి సోదరుడికి ఆయుషు, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు ఆ సోదరుడు ఆ సోదరికిజీవితాంతం ఏ ఆపద రాకుండా కాపాడతానని వాగ్దానం చేస్తాడు.

అయితే రాఖీ కట్టటానికి కూడా సమయం ఉంటుంది. ఆ సమయం గురించి తెలుసుకొని ఆ సమయంలో కడితే అష్ట ఐశ్వరం సొంతం అవుతుంది. కట్టిన సోదరికి,కట్టించుకున్న సోదరుడికి కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ సమయం గురించి తెలుసుకుందాం.ప్రతి రాఖీ పౌర్ణమి రోజు బద్ర సమయం ఉంటుంది. ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. జ్యోతిష్యులు ఏదైనా మంచి పని చేసినప్పుడు చేయకూడని సమయాన్ని బద్ర అని పిలుస్తారు. బద్ర సమయం,దుర్ముహర్తము సమయాలలో రాఖీ ముడులు వేయకూడదు. అశుభ గడియలు,రాహుకాలం మరియు యమ గడియల సమయంలో కట్టకూడదు.

రాఖీ పౌర్ణమి ఆగస్టు3 ఏ సమయంలో అయినా రాఖీ కట్టవచ్చు . రాఖీ కట్టటం ద్వారా అన్నాచెల్లెళ్లకు,అక్క తమ్ముళ్లకు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.