విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..?
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. తన ఆంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డ్ లను నెలకొల్పాడు. అంతేకాక క్రికెటర్ గా ఎంత పేరు సంపాదించాడో సెలబ్రిటీగా కూడా అంతే పేరు సంపాదించాడు. దాంతో అనేక కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవటానికి కోహ్లీ వెంట పడ్డాయి. కోహ్లీ ఒక యాడ్ చేయటానికి ఒక రోజు పారితోషికం ఎంత తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవుతారు. విరాట్ కోహ్లీ ఒక యాడ్ షూట్ చేయటానికి కంపెనీ వారికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే కేటాయిస్తాడు.ఆ రోజుల్లోనే యాడ్ షూట్ చేయటం,ప్రెస్ మీట్ పెట్టటం వంటివి అన్ని చేయాలి. ఇక ఆ సమయంలో కోహ్లి ఒక రోజుకి ఏకంగా రూ.2.50 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అయితే ఇది గతంలో మాట. ఇప్పుడు మరీ అతని బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. కనుకనే ఇప్పుడు ఏకంగా రోజుకు రూ.5 కోట్ల వరకు యాడ్స్ షూట్ చేయడానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే కోహ్లీ కి మరోరకంగా కూడా సంపాదన వస్తుంది. అది ఎలా అంటే కోహ్లీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా వస్తుంది. ఇన్‌స్టాగ్రాం అకౌంట్ లో కోహ్లీ 16.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
అందువల్ల కోహ్లీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ లో ఏదైనా బ్రాండ్ గురించిన పోస్ట్ పెట్టాలంటే రూ.3.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. కచ్చితంగా అంత మొత్తం చెల్లిస్తేనే తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ లో ఆ కంపెనీకి చెందిన పోస్ట్ పెడతాడట. ఇదండీ కోహ్లీ సంపాదన.