Devotional

శ్రావణ మాసంలో ఇచ్చే తాంబూలంలో ఈ వస్తువులను పెట్టకపోతే ఏమి జరుగుతుందో తెలుసా?

శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మంగళవారం నోములు,శ్రావణ శుక్రవారం పూజలతో చాలా హడావిడిగా ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ పూజలు చేసేటప్పుడు తాంబులం తప్పనిసరిగా ఇస్తూ ఉంటాం. అయితే తాంబులం ఇవ్వటానికి కూడా ఒక పద్దతి ఉంది. శ్రావణ మంగళవారం ఇచ్చే తాంబులంలో తమలపాకు,వక్క,శనగలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారు సౌభాగ్యానికి ఈ వ్రతాలు,పూజలను చేస్తూ ఉంటారు. ఆడవారికి ఎక్కువగా చంద్ర దోషం,కుజ దోషము ఉంటాయి. అలాగే సూర్య అనుగ్రహం కూడా ఉండాలి. అందువల్ల ఈ రెండు దోషాలు పోయి సూర్య అనుగ్రహం పొందటానికి తమలపాకు,వక్క,శనగలు ఈ మూడు వస్తువులను తాంబులంగా ఇస్తారు. గురు బలానికి శనగలను ఇస్తారు. అలాగే మారిన ఋతువులో ఉడికించిన శనగలను తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా వ్యక్తిగతంగా,ఆరోగ్యపరంగా,కుటుంబ పరంగా అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి. అందువల్ల మన పెద్దలు ఈ తాంబులం ఈ విధంగా ఇవ్వాలని నియమం పెట్టారు.