Devotional

సెప్టెంబర్ 9 లోపు అంటే శ్రావణ మాసం వెళ్లే లోపు వీటిని స్త్రీలకు దానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి

మొత్తం 12 మాసాల్లో శ్రావణ మాసం అనేది శివుడు,విష్ణు మూర్తి,లక్ష్మి దేవి ఇలా దేవతా మూర్తుల అందరికి ఇష్టమైన మాసం. అందువల్ల శ్రావణమాసంలో జపం,తాపం,పూజ,స్నానాలు,దానాలు చేయటం వలన పాపాలు తొలగిపోవటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు సొంతం అవుతాయి. అయితే శ్రావణ మాసంలో ఎటువంటి దానాలు చేయాలి. ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసా? ఇప్పుడు ఆ దానాలు,ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ దానాలను శ్రావణ మాసంలో ఎప్పుడైనా చేయవచ్చని పండితులు చెప్పుతున్నారు. శ్రావణ నక్షత్రానికి అధిపతి శని. అందువల్ల శనీశ్వరుడికి సంబందించిన దానాలు చేయాలి.

అంటే నల్లని బట్టలు,నువ్వులు వంటి వాటిని దానం చేయాలి. శ్రావణ మాసంలో ఆడవారు చేసే వ్రతాలు,పూజలు దానాలు అన్ని వారి ఐదవతనాన్ని కాపాడుకోవటానికి చేస్తూ ఉంటారు. శ్రావణ మాసాన్ని స్త్రీలకు సంబందించిన మాసంగా చెప్పుతారు. ఎందుకంటే ఈ మాసంలో అన్ని రోజులు దాదాపుగా పర్వ దినాలే. అంతేకాకుండా శ్రావణ మంగళ వారాలు, శ్రావణ శుక్రవారాలు అంటూ ఎన్నో పూజలు,వ్రతాలు చేస్తూ ఉంటారు.

ఆడవారు ఈ శ్రావణ మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ వ్రతం అయినా వారి కుటుంబం,భర్త,పిల్లల క్షేమం,సుఖ సంతోషాల కోసం చేస్తారు. ఈ మాసంలో పూజ పూర్తి అయినా తర్వాత తాంబూలం ఇస్తారు. ఆ తాంబూలంతో పాటు దోష నివారణకు దానాలను కూడా ఇచ్చేస్తూ ఉంటారు. తాంబూలంలో ఆకు,వక్క,సున్నం పెట్టి ఇస్తారు. వీటితో సూర్య,చంద్ర,కుజ దోషాలు తొలగిపోతాయి.

నానబెట్టిన సెనగలు లేదా పెసలను దానంగా ఇస్తే బుధ గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ దానాలను ప్రత్యేకంగా ఇవ్వకుండా తాంబూలంతో పాటుగా ఇచ్చేస్తూ ఉంటారు. అదే మగవారు అయితే వారి గ్రహ దోషాన్ని బట్టి దానాలు చేయాలి. వస్త్ర దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి.

ఈ శ్రావణ మాసంలో ఏ దానం చేసిన మాములు రోజుల్లో కలిగే ఫలితం కన్నా వెయ్యి రేట్ల అధిక ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఇలానే దానాలు ఇచ్చి జన్మ జన్మల పాపాలను తొలగించుకొని పుణ్యాన్ని సంపాదించి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండండి.