Movies

నందమూరి హరికృష్ణ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? నమ్మలేని నిజాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు కొడుకుగా ,బాలయ్యకు అన్నగా,జూనియర్ ఎన్టీఆర్ కి తండ్రిగా నందమూరి హరికృష్ణ మన అందరికి సుపరిచితమే. అయన సినిమాలు,రాజకీయాల ద్వారా కూడా మనకు పరిచయమే. అటువంటి హరికృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం.

నందమూరి తారకరామారావు బసవతారకం దంపతులకు మూడవ కుమారునిగా హరికృష్ణ సెప్టెంబర్ 2న జన్మించాడు.

1967 లో ఎన్టీఆర్ నటించిన’ శ్రీకృష్ణ అవతారం’ సినిమాలో బాల నటుడిగా హరికృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘తల్లా పెళ్ళామా’ సినిమాలో నటించాడు.
Actor Nandamuri Harikrishna
1974 లో వచ్చిన ‘తాతమ్మ కల’ సినిమాలో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

1998 లో మోహన్ బాబుతో కలిసి శ్రీరాములయ్య సినిమాలో నటించారు.

1982 లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ చైతన్య రథానికి డ్రైవర్ గా ఉండి రాష్ట్రము అంతా పర్యటించారు.

తెలుగుదేశం పార్టీ లో ఎన్.టి.ఆర్ పై తిరుగుబాటు చేసినపుడు హరికృష్ణ చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిలిచారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసాడు. హిందూపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వచించాడు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు.
Actor Nandamuri Harikrishna 1
హరికృష్ణ కొడుకులు కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోలుగా ఉన్నారు.

1999 లో నాగార్జునతో కలిసి సీతారామరాజు సినిమాలో నటించాడు.

సుమన్ , వినీత్ , ఆదిత్య ఓం,భానుప్రియ తదితరులతో కల్సి లాహిరి లాహిరి సినిమాలో హరికృష్ణ నటించాడు.

జగపతి బాబుతో కలిసి శివరామరాజు సినిమాలో నటించాడు హరికృష్ణ.

వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ‘సీతయ్య ఎవరి మాట వినడు’ అనే డైలాగ్ పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో సిమ్రాన్,సౌందర్య హీరోయిన్స్ గా నటించారు.

‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ సినిమాలో రైతు సమస్యలపై పోరాటం చేసే ఒక పవర్ ఫుల్ రోల్ పోషించాడు.

‘స్వామి’ సినిమాలో చెల్లెళ్లను చంపిన వారి మీద పగ తీర్చుకొనే పాత్రను పోషించాడు. ఈ సినిమాలో హరికృష్ణకు జోడిగా మీనా నటించింది.

‘శ్రావణమాసం’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించాడు.