Movies

మెగాస్టార్ చిరంజీవితో ఆ నలుగురు హీరోయిన్స్ నటించలేదు…కారణం ఏమిటో తెలుసా?

కొందరికి ఛాన్స్ లు రావు. కానీ మరికొందరికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. ఇంకొందరూ ఛాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేరు. ముఖ్యంగా సినీ రంగం అయితే,అసలు చెప్పక్కర్లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవికి 60ఏళ్ళు దాటినా, ఇప్పటికీ ఆయన పక్కన నటించడానికి ఎంతోమంది హీరోయిన్స్ పోటీ పడుతుంటారు. చిరు తో నటించడం అంటేనే ఓ క్రేజ్ గా భావిస్తారు. ఇప్పటి పరిస్థితులలో నయన తార,త్రిష,అనుష్క వంటి హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు.

అయితే అప్పట్లో ఓ నలుగురు హీరోయిన్స్ఆయన సరసన నటించలేదు. అలాగని ఆ హీరోయిన్స్ పెద్దగా పేరులేని వాళ్ళు కాదు. అందులో ముగ్గురు ఇప్పటికీ తెరమీద కనిపిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే,ముఖ్యంగా హీరోయిన్ రజని విషయానికి వస్తే,బ్రహ్మముడి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈమెను అప్పట్లో జయప్రదలా,రాధలా ఉందని అనేవారు.

అయితే ఆమె ఎవరినీ అనుకరించకుండా, సొంత ఇమేజ్ తో దాదాపు 150సినిమాల్లో నటించి మెప్పించింది. కృష్ణ, శోభన్ బాబు,బాలకృష్ణ,సుమన్, నాగార్జున, వెంకటేష్,అర్జున్,రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్,చంద్రమోహన్, నరేష్,మోహన్ బాబు ఇలా అందరితో అప్పట్లో నటించిన ఈమె మెగాస్టార్ తో చేయలేదు. నిజానికి చిరుతో ఒకటి రెండు సార్లు ఛాన్స్ లు వచ్చినా,ఇండస్ట్రీలోని లాబీయింగ్ కారణంగా చేజారిపోయిందని రజని చెప్పింది. కొన్ని పేపర్స్ అడిగారని,అవి ఇవ్వనందుకే పగతో సదరు అవకాశాలను నాశనం చేసారని ఆమె చెబుతుంది.

ఇక అప్పటిలో మాస్ క్యారెక్టర్స్ తో పాటు కుటుంబ కథా చిత్రాల్లో నటించిన మరో హీరోయిన్ అశ్విని. ఈమె చాలా చిన్న వయస్సులో గుండె పోటుతో చనిపోయింది. ఈమె కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్,రాజశేఖర్, నరేష్,రాజేంద్ర ప్రసాద్ తదితరులతో నటించింది. బాలయ్యతో భానుమతి గారి మొగుడు సినిమా చేస్తున్న సమయంలో చిరుతో నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి వెనక్కి పోయిందని చెబుతుంటారు. 1989లో ఆఖరి క్షణం ఆమెకు చివరి తెలుగు సినిమా. ఆతర్వాత టివి సీరియల్స్ లో నటిస్తూ 2012లో హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. ముఖ్యంగా జంద్యాల డైరెక్షన్ లో వచ్చిన చూపులు కల్సిన శుభవేళ,వివాహ భోజనంబు వంటి చిత్రాలను చూసిన వాళ్ళు అశ్వినిని మరిచిపోలేరు.

ఇక 1990లో సినీ రంగంలో కాలుమోపిన ఆమని అంటే అందరికీ తెల్సు కదా. నిజానికి మంజు పేరుతొ ఒకటి రెండు చిత్రాలు చేసిన ఆమని,తెలుగులో అందరి టాప్ స్టార్స్ తో నటించి, మెప్పించింది. కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున,సుమన్,రాజశేఖర్,మోహన్ బాబు నరేష్,రాజేంద్ర ప్రసాద్ తదితరులతో పాటు తమిళంలో కమలహాసన్, విజయ కాంత్, కన్నడంలో విష్ణు వర్ధన్ వంటి హీరోలతో నటించింది. అయితే,చిరుతో నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని ఆమె ఇప్పటికీ బాధ పడుతుంది.

సౌందర్య తో కల్సి చేస్తున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చినా ఎందుచేతనో నిర్మాతలు తనను తొలగించారని ఆమె చెబుతుంది. రిక్షావోడు,చూడాలని వుంది,శ్రీ మంజు నాధ చిత్రాల్లో సౌందర్య నటించగా,ఇందులో రిక్షావోడు మూవీలో పొగరుబోతు భార్య క్యారెక్టర్ కి ఆమని ని ఎంపిక చేయాలని అనుకున్నారని ప్రచారంలో ఉంది. అయితే అప్పటికే తెలుగులో ఫేడ్ అవుట్ అయిపోయిన నగ్మాను లాబీయింగ్ తోనే,అందులో ఎంపిక చేసారని టాక్.

ఇక చిరుతో నటించలేకపోయిన మరో హీరోయిన్ ఇంద్రజ అని చెప్పాలి. కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున,సుమన్,వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ లతో నటించిన ఈమె పెద్దన్నయ్య తర్వాత మెగాస్టార్ సరసన నటిస్తుందని అనుకున్నారు. ఆ మూవీ చూసినవాళ్లు చిరుకి ధీటుగా స్టెప్స్ వేయగల నటి ఇంద్రజ అని అనుకున్నారు.

అయితే ఆమె చిన్న చిన్న హీరోలతో నటించడానికి తనంతట తానే నటించడం, క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటించడం వలన,చిరుతో ఛాన్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదట. ఇక ఆతర్వాత పెళ్లిచేసుకున్న ఇంద్రజ పూర్తిగా మలయాళ మూవీలకే పరిమితం అయిపొయింది. అయితే ఇంద్రజ అంటే చిరు అభిమానం చూపిస్తారు. శతమానం భవతి సినిమా కూడా ఇంద్రజ కోసమే చూసినట్లు ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా చిరు చెప్పారు.