Movies

‘ఋతురాగాలు’ సీరియల్ హీరోయిన్ రూపాదేవి గుర్తు ఉందా… ఆమె తల్లి తల్లి తండ్రి ఇద్దరూ స్టార్స్… ఎవరో తెలుసా

సినిమాల్లో నటించడం ఒక ఎత్తు. ఫలానా క్యారక్టర్ ని చూడగానే అది వేసిన నటీనటులు ఎవరో ఠక్కున గుర్తొస్తారు. అది సినిమా రంగంలోనే కాదు బుల్లితెర మీద కూడా అలాంటి ముద్ర వేసిన నటీనటులు వున్నారు. అలా సీరియల్స్ లో ఓ ప్రత్యేక గుర్తింపు కొందరి సొంతం చేసుకున్న వాళ్లలో అందరికి గుర్తొచ్చే హీరోయిన్ రూపాదేవి. ఒకే ఒక్క సీరియల్ తో స్టార్ హీరోయిన్ గా చెరగని ముద్రవేసిన రూపాదేవి ఆ సీరియల్ తో తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒకప్పటి టాప్ హీరోయిన్ బుల్లితెర నటి అయిన రూపాదేవి 1967నవంబర్ 7న జన్మించింది.

సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టిన రూపాదేవి ఎంబీఏ చదివి,సినిమా హీరోయిన్ కావాలని ఎన్నోకలలు కంది. ఒరుతాలై రాగం సినిమా తమిళంలో అరంగేట్రం చేసిన రూపాదేవి తొలిసినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. దాంతో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఈమె కన్నడం లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అప్పటి స్టార్ హీరోలు రాజ్ కుమార్ , విష్ణు వర్ధన్,కళ్యాణ్ కుమార్,శ్రీనాధ్ , అంబరీష్,అనంత నాగ్ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న రూపాదేవి,తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే షాకవతాం.అవును, రూపాదేవి తల్లి పేరు అదవాని లక్ష్మీదేవి 1940 – 50ల్లో కన్నడ రంగాన్ని ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలియదు.

ఇక తండ్రి పేరు కళ్యాణం రఘురామయ్య. ఇంతకీ ఈయన్ని కళ్యాణం రఘురామయ్య అనడం కన్నా ఈలపాట రఘురామయ్య అంటే అందరూ యిట్టె గుర్తుపడతారు. ఎందుకంటే, ఆయన అంత పాపులర్. ఈనాటి తరంలో ఈయన ఎలా వుంటారో తెలియక పోవచ్చు గానీ, ఎవరైనా ఈలా వేస్తుంటే, ఈలపాట రఘురామయ్యలా వేస్తున్నావే అని మాత్రం అనేయడం ఈనాటికి చాలాచోట్ల విన్పించే మాట.

ఈలపాట రఘురామయ్య 1901నుంచి 1975వరకూ దాదాపు 70ఏళ్ళు తెలుగు సినీ రంగంలోనూ,నాటక రంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసిన మహోన్నత నటుడు ఈయన. ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో కృష్ణుడు ,దుష్యంతుడు, నారదుడుగా నటించి, మెప్పించిన ఈయనకు ఈయనే సాటి అని చెప్పవచ్చు.

నాటకాల్లో పద్యాలను ఈలపాటతో రాగాలాపన చేస్తూ ఆనంద డోలికల్లో తెలియాడించిన గొప్పనటుడు. అందుకే ఈయన ఇంటిపేరు ఈలపాటగా మారిపోయింది. 1933లో పృథ్వి పుత్ర మూవీతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన ఈయన సినీ రంగంలో సంచలనం సృష్టించడమే కాదు దాదాపు 20వేల నాటక ప్రదర్శనలిచ్చారు. ఇక నాటక ,సినీ రంగాల్లో ఈయన చేసిన సేవలకు 1975లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రూపాదేవికి నటన వెన్నతో పెట్టిన విద్య అయిందని అంటారు.