Movies

మన హీరోల్లో ఎక్కువ పారితోషికం ఎవరు తీసుకుంటున్నారు… టాప్ 10 లిస్ట్ చూడండి

ఈ సంవత్సరం టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో గురించి ఒక లుక్ వేద్దాం. అలాగే టాప్ 10 లో ఎవరు ఉన్నారో కూడా చూద్దాం.

మహేష్ బాబు
మహేష్ బభౌ భరత్ అనే నేను సినిమాకి 20 కోట్లు మరియు లాభాల్లో 50 శాతం వాటాని తీసుకున్నాడట. బ్రహ్మోత్సవం,స్పైడర్ డిజాస్టర్ కావటంతో పారితోషికం వెనక్కి ఇచ్చేసినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్
కాటంరాయుడు సినిమాకి 22 కోట్లు తీసుకుంటాడు. అజ్ఞాతవాసి ప్లాప్ అవ్వటంతో పారితోషికం వెనక్కి ఇచ్చేసాడు.

ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 22 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటాడు.

రామ్ చరణ్ తేజ్
రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 18 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటాడు.

ప్రభాస్
బాహుబలి రెండు పార్ట్ లలో ఒక్కోదానికి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడు. ఆ తర్వాతి సినిమాకి మాత్రం 15 కోట్లను తీసుకున్నాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి 15 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటాడు.

రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు తీసుకుంటాడు.

బాలకృష్ణ
పైసా వసూల్,జయసింహ సినిమాలకు బాలకృష్ణ 9 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు.

వెంకటేష్
విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకి 8 కోట్ల రూపాయిలను తీసుకుంటాడు.

నాగార్జున
నాగార్జున ఒక్కో సినిమాకి 7 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటాడు.