Movies

బాల నటి నుంచి నిర్మాతగా మారిన ఈ నటిని గుర్తు పట్టారా… ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?

సినిమాల్లో చిన్ననాడే ప్రవేశించి బాల నటీనటులుగా ఆరితేరి, ఆతర్వాత పెద్ద పెద్ద నటులుగా ఎదిగిన వాళ్ళూ ఉన్నారు. బాలనటులుగా రాణించి ఆతరువాత వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళూ వున్నారు. ఇక బాలనటీనటులుగా పనిచేసినవారికి ఇండస్ట్రీతో సంబంధాలు బానే ఉంటాయి. ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. శ్రీదేవి, మీనా, రాశి,వంటివాళ్ళు బాలనటిగా హీరోల పక్కన వేసి, ఆతర్వాత అదే హీరోలతో రొమాన్స్ పండించే హీరోయిన్స్ గా మెప్పించారు. ఇక కుట్టి పద్మిని బాలనటిగా రంగప్రవేశం చేసి అందరి మన్ననలు అందుకుంది.ఇక కుట్టి పద్మిని 1956లో మద్రాస్ అయ్యంగార్ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఓ పెద్ద సంస్థలో జీఎం గా పనిచేయడమే కాకుండా, సినీ నిర్మాతగా వ్యవహరించారు. ఈమె తల్లి రాధాబాయి వందల కొద్దీ తమిళ చిత్రాల్లో నటించారు.

మూడేళ్ళ వయస్సులో బాలనటిగా రంగప్రవేశం చేయడంతో సరిగ్గా స్కూల్ కి వెళ్లలేకపోయింది. తమిళనాట మొట్టమొదటి సరిగా జాతీయ అవార్డు అందుకున్న బాలనటిగా రికార్డు క్రియేట్ చేసిన ఈమె బి ఏ లిటరేచర్ తో పట్టా అందుకుంది. తెలుగులో దైవబలం, ఇల్లరికం,శాంతినివాసం,భక్త జయదేవ,మంచి మనసులు,ఇరుగు పొరుగు,అంతస్తులు, శకుంతల వంటి చిత్రాల్లో నటించింది.

ఇక లేతమనసులు చిత్రంలో బాలనటిగా పప్పీ,లల్లీ అనే ద్విపాత్రాభినయం పోషించి, ఆరోజుల్లో తెలుగునాట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కుట్టి పద్మిని, పెద్దఅయ్యాక సపోర్టింగ్ నటిగా నటించించింది నిజానికి ఎక్కువ తమిళ చిత్రాల్లో ఈమె నటించినప్పటికీ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటించింది.

మూడేళ్ళ వయస్సులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టిన కుట్టి పద్మిని అలనాటి స్టార్ హీరోలు ఎం జి రామచంద్రన్, శివాజీ గణేశన్,రజనీ కాంత , కమల్ హాసన్,జయశంకర్ తదితరుల చిత్రాల్లో నటించింది. టివి సీరియల్స్ లో కూడా రాణించింది. వైష్ణవి ఎంటర్ ప్రయిజ్స్ అనే సంస్థను నెలకొల్పి,టివి సీరియల్స్ నిర్మించారు.

కృష్ణ దాసి, రామపురి పాండియన్,రామానుజర్ వంటి సీరియల్స్ కి నిర్మాతగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. నడిగర్ సంఘంలో కార్యవర్గ సభ్యురాలిగా, బిజెపి స్టేట్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. తెలుగులో కేటుగాడు, ఆనందరావు పెళ్లి,ఆవకాయ్ గాళ్స్ వంటి సీరియల్స్ లో నటించి , నిర్మించారు. తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా నటిగా పేరుగాంచింది. మూడు దశబ్దాలుగా నటిగా, నిర్మాతగా , వ్యాపార వేత్తగా సక్సెస్ ఫుల్ వుమెన్ గా పేరుగాంచిన కుట్టి పద్మిని ఎందరికో ఆదర్శం.