Politics

కేసీఆర్ బాడీగార్డ్స్ కళ్ళకు అద్దాలు,చేతిలో బ్రీఫ్ కేస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?

ప్రముఖులకు భద్రత కల్పించడం చూస్తుంటాం. ప్రధాని, ముఖ్యమంత్రులు,ఇంకా పలుచోట్ల విపక్షనేతలు ఇలా చాలా మందికి జెడ్ క్యాటగిరీ, జెడ్ ప్లస్ ఇలా రకరకాల భద్రత ఉండడం సహజం. అయితే తెలంగాణా సీఎం కేసీఆర్ కి భద్రత చూస్తున్న బాడీ గార్డ్స్ కళ్ళకు అద్దాలు, చేతిలో సూట్ కేస్ ఉండడం చాలామంది చూసే వుంటారు. అసలు ఇలా ఎందుకు ఉంటాయి అనే దానికి పలురకాల వ్యాఖ్యానాలు వినస్తుంటాయి. తాజాగా ఓ సభలో తెలంగాణ ప్రగతి నివేదిక సమ్పార్పిస్తున్న కేసీఆర్ సభలో ఆయన్ని వెన్నంటిన బాడీ గార్డ్స్ ని పరిశీలిస్తే అసలు కళ్లద్దాలు, బ్రీఫ్ కేసు ఎందుకో తెలుసుకోవాలని చాలామందికి అనిపించింది. వీళ్ళ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
Kcr And Putarekulu
ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే,అయితే కంటి వెలుగు కోసం ఆ బాడీగార్డ్స్ ఇద్దరికీ కళ్లద్దాలు ఇచ్చారంటూ కొన్ని సోషల్ మీడియాల్లో పోస్టులు రావడం, వాటిపై విభిన్న కామెంట్స్ కూడా రావడం సరేసరి. ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా చిరాకు రప్పిస్తాయని చెప్పవచ్చు. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్, కమెండోలు ఇలా కళ్లద్దాలు పెట్టుకోవడం వలన ప్రాక్టికల్ గా మంచిదట.

మామూలు కూలింగ్ గ్లాసెస్ మాత్రం కావండోయ్. మిగిలిన రోజుల్లో ఎలా వున్నా, తాము భద్రత కల్పిస్తున్న ప్రముఖుడు జనంలో ఉన్నప్పుడు, అతనికి ప్రమాదం తీవ్ర స్థాయిలో పొంచివున్నపుడు, సదరు ప్రముఖుడు ఎలాంటి మూవ్ మెంట్ లేకుండా ఎక్కువసమయం ఒకేచోట నిల్చోవాల్సి వచ్చినపుడు, అలాగే ప్రముఖునికి ఇరువైపులా, చుట్టూ నిలబడి రక్షణ ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ గ్లాసెస్ ధరిస్తారు.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్,సీఆర్ పిఎఫ్ రక్షణ, కమెండోస్ ఇలా ఆయా ప్రముఖులకు కల్పించే భద్రత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రధాని, తదితర ప్రముఖుల రక్షణ చుట్టూ ఉండే రక్షణ దళం సూటూ బూటు, టై వేసుకుని బ్యూరో క్రాట్లలా సాఫ్ట్ కనిపించే కమెండోస్ ప్రాణాలకు తెగించి రక్షణ కల్పించే రక్షణ దళం అన్నమాట.

అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు అకస్మాత్తుగా కాల్పులు స్టార్ట్ చేస్తారు. వివి ఐపి చుట్టూ అనుమాస్పద కదలికల్ని పసిగడుతూ,ముఖంలో భావాలు కన్పించకుండా ఉండడానికి ఈ కళ్లద్దాలు దోహద పడతాయి. అసలు వాళ్ళ కళ్ళు ఎక్కడ ఫోకస్ అయ్యాయో కూడా తెలియదు. హఠాత్తుగా ప్రమాదం జరిగితే దుమ్ము ధూళి వంటివి చెలరేగితే,కళ్ళల్లో పడకుండా రక్షణ కల్పిస్తాయి. సూర్యరశ్మి, కెమెరా ఫ్లాష్ లు వంటివాటిని తట్టుకుని నిలబడడానికి ఈ గ్లాస్ లు అవసరం. అప్పుడే ప్రమాదం నుంచి ప్రముఖుణ్ణి వెంటనే కాపాడ్డానికి వీలవుతుంది.

ఇక బాడీ గార్డ్స్ చేతిలో సూట్ కేసులు ఏమిటంటే,ప్రత్యేక భద్రతా విభాగంలో ఉండే భద్రతా సిబ్బంది, ఆయా సందర్భాల్లో సూట్ కేసులను తమతో పాటు తెచ్చుకుంటారు. అనుకోకుండా పేళ్ళుల్లు,కాల్పులు సంభవిస్తే,తక్షణం ఆ సూట్ కేసు ఓపెన్ చేసి,వివి ఏపీని రౌండ్ అప్ చేస్తారు. ఇందులో బులెట్ ప్రూఫ్ రక్షణకు దోహదం చేస్తుంది. బులెట్ ప్రూఫ్ తో కూడిన సూట్ కేస్,లో స్మాల్ ఎండ్ సో ఫస్టు కేటేడ్ వెపన్స్, చెవుల్లో దూరి కనిపించని చిన్నపాటి ఇయర్ ఫోన్,ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఇలాంటి వన్నీ వివి ఐపి రక్షణ లో భాగం.