ఈ బాలనటున్ని గుర్తు పట్టారా? ఇప్పుడు ఎలాంటి స్థాయికి ఎదిగాడో చూస్తే ఆశ్చర్యపోతారు
చాలామంది చిన్నప్పుడు బాల నటులుగా రాణించి, మంచి పేరు,అవార్డులు తెచ్చుకుని పెద్దయ్యాక కూడా నటులుగా చేస్తూ అందరి హృదయాల్లో నిలుస్తున్న వాళ్ళను చూస్తూనే వున్నాం. ఇక ఓ బాలనటుడు గురించి తెలుసుకుంటే,సమీర్ అనే యితడు చిన్నప్పుడు పలు సినిమాల్లో బాల నటుడిగా అదరగొట్టాడు. స్వర్గీయ టి కృష్ణ తీసిన రేపటి పౌరులు మూవీలో కోట శ్రీనివాసరావు కొడుకుగా తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఇది చూసి చాలామంది పెద్దయ్యాక మంచి నటుడవుతావని ప్రశంసించారు.
లంచాలు మరిగిన ఎస్సై పాత్రలో కోట శ్రీనివాసరావు నటిస్తే,అతడి చేష్టలను అసహ్యించుకునే పాత్రలో సమీర్ అదరగొట్టాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో చేసిన సమీర్ వయస్సు కొంచెం పెరిగాక ఒకటి రెండు సినిమాల్లో కనిపించాడు.
అందులో సూపర్ కృష్ణ నటించిన రౌడీ అన్నయ్య,ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన చంటి చిత్రాలు ముఖ్యమైనవి. చంటిలో నాజర్ చిన్నప్పటి వేషంలో సమీర్ ఒదిగిపోయాడు. ఆ తర్వాత వయస్సు పెరగడంతో టివి సీరియల్స్ లో చేయడం మొదలు పెట్టాడు.
ఇక శుభ సంకల్పంతో వెండి తెరకు రీ ఎంట్రీ కూడా ఇచ్చినట్లు చెబుతారు. టివి సీరియల్స్ లో నటించే సమీర్ టాలీవుడ్ లో కూడా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా రాజమౌళి మూవీస్ లో గుర్తుండిపోయే పాత్రలు చేసాడు.
ఇక టివి సీరియల్స్ కి సంబంధించి ఋతురాగాలు,ముగ్ద,కస్తూరి,శాంతినివాసం వంటి సీరియల్స్ లో నటించిన సమీర్ ,ప్రస్తుతం హీరో ఫ్రెండ్ గానో,బావగానో, డాక్టర్ గానో,అన్నదమ్ముల పాత్రలనో తప్ప , హీరోగా అవకాశాలు రాలేదు. సైడ్ కేరక్టర్స్ కి పరిమితం అయిన సమీర్ పెద్దయ్యాక శుభ సంకల్పంతో మొదలు పెట్టి, ఇంతవరకూ 80సినిమాలు చేసాడు.